Andhra Pradesh: వైసీపీ నేతకు రోడ్డు ప్రమాదం.. ప్రత్యర్థి అయినా పరామర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు
ABN, Publish Date - Aug 25 , 2024 | 10:30 PM
టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ్ తిలక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ్ తిలక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నందిగాం సమీపంలో తిలక్ ప్రయాణిస్తున్న కారు అదుపుబ తప్పి మరో వాహనాన్ని, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తిలక్‌తో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తిలక్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తిలక్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. తర్వగా గాయల నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. కొద్దిరోజుల క్రితమే పేరాడ తిలక్‌ను వైసీపీ టెక్కలి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అంతకుముందు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయను పదవి నుంచి తప్పించారు. దీంతో తిలక్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు.
అచ్చెన్నాయుడు పరామర్శ..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు కావడంతో ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ సీనియర్ నేత, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తిలక్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయం నుంచి కోలుకునేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Aug 25 , 2024 | 10:33 PM