Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరాలయంలో విరిగిపడిన పగడ చెట్టు కొమ్మలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:37 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం 300 ఏళ్ల నాటి పగడ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasti Temple)లోని రాయలవారి మండపం పక్కనే పగడ చెట్టు ఉంది. ప్రస్తుతం రాయలవారి మండపంలో రూ.500 రాహుకేతు పూజలను జరిపిస్తుంటారు.

- తప్పిన ముప్పు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం 300 ఏళ్ల నాటి పగడ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasti Temple)లోని రాయలవారి మండపం పక్కనే పగడ చెట్టు ఉంది. ప్రస్తుతం రాయలవారి మండపంలో రూ.500 రాహుకేతు పూజలను జరిపిస్తుంటారు. అటు రాహుకేతు పూజలకు వచ్చే భక్తులతో పాటు పక్కనే ఉన్న ఉచిత ప్రసాదాలను స్వీకరించిన భక్తులు కూడా పగడచెట్టు కిందకు చేరుతుంటారు.
ఈ వార్తను కూడా చదవండి: New Year: యువతకు కిక్కిచ్చేలా.. నూతన సంవత్సర వేడుకలకు భారీ ఏర్పాట్లు
ఈ క్రమంలో సోమవారం చెట్టు నుంచి రెండు భారీ కొమ్మలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇటీవల వర్షాలకు కొమ్మలునాని బరువు ఎక్కడం, చెట్టు వేరు వ్యవస్థకు నీరు చేరకపోవడం వల్ల కొమ్మలు బలహీన పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News
Updated Date - Dec 31 , 2024 | 11:39 AM