Srisailam: మల్లన్న హుండీ ఆదాయం.. రూ.4.83 కోట్లు
ABN, Publish Date - Jan 10 , 2024 | 09:40 PM
శ్రీశైలం మల్లన్నకు హుండీ ద్వారా రూ.4.83 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
నంద్యాల: శ్రీశైలం మల్లన్నకు హుండీ ద్వారా రూ.4.83 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మొత్తం 28 రోజల్లో రూ.4,83,53,238ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. నగదుతో పాటూ 133 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 11 కేజీల 850 గ్రాముల వెండి వచ్చినట్లు వివరించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2024 | 09:42 PM