Margadarsi: మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లికి సుప్రీం సూచన
ABN , Publish Date - Apr 09 , 2024 | 03:41 PM
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ల విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. కేవలం టెక్నికల్ రీజన్స్‌తోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లలేదని తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 09: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ల విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. కేవలం టెక్నికల్ రీజన్స్‌తోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లలేదని తెలిపింది. అయితే టెక్నికల్ రీజన్స్ దృష్ట్యానే పంపుతున్నామంది. కొన్ని విషయాల్లో బ్యాడ్ ప్రిసిడెన్సీ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పంపుతున్నట్లు చెప్పింది.
Ugadi 2024: వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్
ఆరు నెలల్లో విచారణ చేపట్టి తుది నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా తేల్చి చెప్పింది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్నంత కాలం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియా ముందుకు వెళ్లక పోవడం మంచిదని సూచించింది. సబ్‌జుడీస్ మేటర్‌లో... సంయమనం పాటిస్తే మంచిదని బెంచ్ అభిప్రాయపడింది. అయితే మార్గదర్శి నిజాయితీని ఎక్కడా శంకించడం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Rajiv Kumar: సీఈసీ రాజీవ్‌కుమార్‌కు 'జడ్' కేటగిరి భద్రత
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ...