ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుప్రీంలో విజయపాల్‌కు ఎదురుదెబ్బ

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:43 AM

సీఐడీ మాజీ అధికారి ఆర్‌ విజయపాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నరసాపురం మాజీ ఎంపీ, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

  • రఘురామపై కస్టోడియల్‌ హింస కేసు

న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ అధికారి ఆర్‌ విజయపాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నరసాపురం మాజీ ఎంపీ, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సోమవారం సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్‌తో పాటు నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌, నిఘా విభాగం అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న విజయపాల్‌ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబరు 1న విజయపాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించింది. తదుపరి ఉత్వర్వులు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బీ వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం... ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం విజయపాల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Nov 26 , 2024 | 03:43 AM