ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విధ్వంసాన్ని తట్టుకుని.. సగర్వంగా తలెత్తి

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:45 AM

అమరావతి పునర్నిర్మాణం దిశగా వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది.

  • అమరావతి శంకుస్థాపనకు నేటితో తొమ్మిదేళ్లు

  • నవ్యాంధ్ర రాజధానికి చంద్రబాబు శ్రీకారం

  • రూ.50 వేల కోట్ల అగ్రిమెంట్‌ విలువతో పనులు

  • వైసీపీ హయాంలో ఐదేళ్లూ విధ్వంసమే

  • మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వంతో పునర్వైభవం

విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా తొలి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు వేలాది రైతులు బాసటగా నిలిచారు. రాజధాని నిర్మాణానికి తమ భూములను స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందించారు. తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక చారిత్రక ఘట్టంగా రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆనక ప్రభుత్వం మారింది. వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి బీజం పడింది. మూడు రాజధానులు అంటూ రాజకీయ క్రీడకు తెరలేచింది. ఆ ఐదేళ్లు రైతుల ఆవేదన అరణ్య రోదనే అయింది. రైతులు, మహిళలు అలుపెరగకుండా చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. రాజధానితో రాజకీయం చేసిన పార్టీకి ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. నేడు మళ్లీ అమరావతి సగౌరవంగా తలెత్తుకుని నిలబడింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): అమరావతి పునర్నిర్మాణం దిశగా వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది. రాజధానిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. అభివృద్ధి ప్రాజెక్టులను రూ.9 వేల కోట్ల అగ్రిమెంట్‌ విలువతో ప్రారంభించారు. రోడ్లు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ట్రంక్‌ ఇన్ర్ఫా కోసం రూ.13,760 కోట్ల అగ్రిమెంట్‌ విలువను నిర్ణయించారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములకు ప్రతిగా రైతులకు ప్యాకేజీ నిమిత్తం మరో రూ. 37,660.80 కోట్ల అగ్రిమెంట్‌ విలువను నిర్ణయించారు. దాదాపు రూ.50 వేల కోట్ల అగ్రిమెంట్‌ విలువతో కూడిన పనులకు శ్రీకారం చుట్టగా, 2019లో ఎన్నికలు సమీపించే నాటికి భవనాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు రూ. 2,055.43 కోట్లు ఖర్చు పెట్టారు. రూ.3,533.78 కోట్లతో ట్రంక్‌ ఇన్ర్ఫా పనులు, 12,669 కోట్లతో ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులు జరిగాయి. మూడున్నరేళ్లపాటు రాత్రింబవళ్లు పనులు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వం రోడ్లు, ట్రంక్‌ ఇన్ర్ఫా కోసం రూ.1,275 కోట్ల హడ్కో రుణాన్ని తీసుకుంది. అమరావతి బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల కన్సార్టియం ద్వారా రూ.2,060 కోట్ల రుణం తీసుకుంది. మొత్తంగా రూ. 5,300 కోట్లను సమీకరించి కలల రాజధాని సాకారం దిశగా అడుగులు వేసింది.


వైసీపీ అధికారం చేపట్టాక..

వైసీపీ 2019లో అధికారం చేపట్టాక రాజధాని నిర్మాణ పనులను అడ్డుకోవటమే ధ్యేయంగా పావులు కదిపింది. 25 శాతం కూడా పూర్తికాని పనులను నిలుపుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో శాశ్వత రాజధాని పనులు నిలిచిపోయాయి. అతి ముఖ్యమైన జీఏడీ టవర్‌తో పాటు మరో నాలుగు టవర్ల నిర్మాణ పనులు, హైకోర్టు పనులను రూ. 3,453.16 కోట్లతో చేపట్టారు. హైకోర్టు 13 శాతం, జీఏడీ టవర్‌ 19 శాతం, మిగిలిన నాలుగు టవర్లలో టవర్‌-1, 2లు 18 శాతం, టవర్‌-3, 4లు 20 శాతం మేర పనులు పూర్తి చేసుకున్నాయి. వీటన్నింటినీ 25 శాతం పురోగతిలో లేని జాబితాలో చేర్చి పనులను వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేయించింది. తర్వాత నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న మల్టీస్టోరెడ్‌ అపార్ట్‌మెంట్లు, ఎన్‌జీవో అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ టైప్‌-1, 2 బిల్డింగ్‌ పనులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీల బంగ్లాలు, మంత్రులు, జడ్జిల బంగ్లాలు ఆపేశారు. రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల వంటి అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్ల అభివృద్ధిని కూడా పక్కన పెట్టేశారు. అమరావతిలో నెలకొల్పాల్సిన సంస్థలు, అమరావతి నూతన రైల్వేలైన్‌ పనులు, అమరావతి ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌ వంటి వాటిని కూడా రానివ్వకుండా చేశారు.


ఇప్పుడేం జరుగుతోంది..

  • కూటమి ప్రభుత్వం రావటంతోనే రూ. 43 కోట్లతో అమరావతిలో పెరిగిపోయిన పిచ్చిచెట్లను తొలగించింది.

  • ఐదేళ్లుగా శాశ్వత రాజధాని భవనాలు నీటిలో నాని ఉండటం వల్ల అసలు అవి పనికొస్తాయో, లేదో తెలుసుకునేందుకు టెక్నికల్‌ కమిటీని నియమించింది. చెన్నై, హైదరాబాద్‌ ఐఐటీ బృందాలు కాంక్రీట్‌, స్టీల్‌ శాంపిళ్లను సేకరించి పరీక్షించాక ఇవి దృఢంగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చాయి. దీంతో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పనులను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

  • గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 75ు పురోగతిలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీసు అధికారుల భవనాల పాత టెండర్‌ను రద్దుచేసి రూ. 524.70 కోట్లతో తిరిగి పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

  • ఆగిపోయిన సీఆర్‌డీఏ ప్రాజెక్టు కాంప్లెక్స్‌ పనులకు ఇటీవలే సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

  • నిలిచిపోయిన ట్రంక్‌ ఇన్ర్ఫా పనులను ముందుకు తీసుకెళ్లేందుకు డీపీఆర్‌ తయారీకి సీఆర్‌డీఏ సిద్ధమైంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రెండో దశ పనులతో పాటు ఈ-11, ఈ-13 రోడ్లను ఎన్‌హెచ్‌-16కు అనుసంధానం చేసేందుకు టెండర్లు పిలవటానికి సిద్ధమైంది.

  • హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టును మళ్లీ మొదలుపెట్టి పూర్తి చేసేందుకు ఇటీవలే టెండర్లు పిలిచింది.

  • శాశ్వత వరద నివారణ చర్యల్లో భాగంగా కొండవీడు వాగు, గ్రావిటీ వాగు, పాలవాగులను విస్తరించి అభివృద్ధి చేసేందుకు అంచనాలు తయారు చేయిస్తున్నారు. 3 పంపింగ్‌ స్టేషన్లు, ఆరు రిజర్వాయర్లను కూడా అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలవనున్నారు.

  • రాజధాని పనులన్నీ మహాయజ్ఞంలా ప్రారంభమై.. కొత్త సంవత్సరంలో రేయింబవళ్లు పనులు జరగనున్నాయి.

Updated Date - Oct 22 , 2024 | 09:25 AM