కేంద్ర సహాయ మంత్రి వర్మకు పితృ వియోగం
ABN, Publish Date - Nov 22 , 2024 | 04:54 AM
కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు (91) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్‌లోని పైవ్రేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందారు.
భీమవరంటౌన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు (91) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్‌లోని పైవ్రేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సూర్యనారాయణ రాజు సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన భౌతిక కాయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం ప్రజల దర్శనార్థం ఉంచి, మధ్యాహ్నం ఒంటి గంటకు బలుసుమూడి మోక్షధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Updated Date - Nov 22 , 2024 | 04:54 AM