ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: మీమ్స్ వీడియోల ప్రదర్శనపై తంగిరాల సౌమ్య అభ్యంతరం... నందిగామలో టెన్షన్ టెన్షన్

ABN, Publish Date - Jan 16 , 2024 | 11:19 AM

Andhrapradesh: తనపై మీమ్స్ వీడియోలు ప్రదర్శించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా, జనవరి 16: తనపై మీమ్స్ వీడియోలు ప్రదర్శించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు (మంగళవారం) ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

అసలేం జరిగిందంటే... ఈనెల 12న జగనన్న వాక్ వే ప్రారంభోత్సవ బహిరంగ సభలో తంగిరాల సౌమ్యపై షేక్ కరీముల్లా అలియాస్ దుబాయ్ కరిముల్లా మీమ్స్ వీడియోలు ప్రదర్శించారు. ఆమె పిచ్చిది, తేడా అంటూ వీడియోలు ప్లే చేసి బహిరంగ సభలో తంగిరాల సౌమ్యపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు సంచలనంగా మారాయి. దీనిపై తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వ్యవహారంపై నేడు ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పరీశీలకులు కనపర్తి శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు భారీగా మాజీ ఎమ్మెల్్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో నందిగామలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ విషయంపై గతంలో పోలీస్‌ ష్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 16 , 2024 | 11:19 AM

Advertising
Advertising