ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.40 వేల కోట్లతో టాటా ‘పవర్‌’

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:59 AM

పరస్పర సహకారంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్‌ నిర్ణయించాయి.

సౌర, పవన విద్యుత్‌లో భారీ పెట్టుబడి

రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్ల స్థాపన

అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా

టీసీఎస్‌ ఆధ్వర్యంలో ఐటీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌

సచివాలయంలో చంద్రబాబుతో టాటా గ్రూప్‌ చంద్రశేఖరన్‌ భేటీ

పారిశ్రామికాంధ్ర దిశగా కీలక చర్చలు

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పరస్పర సహకారంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్‌ నిర్ణయించాయి. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్‌ రంగంలో రూ.40 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్‌ సంస్థ ముందుకొచ్చింది. 5 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్‌, విండ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. టాటా గ్రూప్‌ సంస్థల ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎన్‌.చందశ్రేఖరన్‌ నేతృత్వంలోని బృందం సోమవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్‌తో సమావేశమైంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పెంచేలా పలు అంశాలపై వీరు చర్చించారు. పలు రంగాల్లో పెట్టుబడులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్లు (తాజ్‌, వివంతా, గేట్‌వే, సెలెక్యూషన్స్‌, జింజర్‌ హోటల్స్‌) నెలకొల్పేందుకు, పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్‌ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే అంశంపై గత ఆగస్టులోనే చంద్రశేఖరన్‌ అమరావతికి వచ్చి చంద్రబాబుతో చర్చించారు. పూర్తిస్థాయి కార్యాచరణతో రావాలన్న సీఎం సూచనతో మూడు నెలలు తిరక్కుండానే ఆయన రెండోసారి వచ్చి చర్చించడం విశేషం. రాష్ట్రాభివృద్ధికి రతన్‌ టాటా ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించడమే ఆయనకు నిజమైన నివాళిగా పేర్కొన్నారు.


టాటా గ్రూప్‌ ప్రధాన భాగస్వామి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో టాటా గ్రూప్‌ ప్రధాన భాగస్వామిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. చంద్రశేఖరన్‌తో చర్చల వివరాలను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. దివంగత రతన్‌ టాటా దార్శనిక నాయకత్వం, అందించిన సహకారం భారతదేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిందని.. రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. విశాఖలో 10 వేల ఉద్యోగాలకు అవకాశం ఉన్న కొత్త ఐటీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను స్థాపించడానికి టీసీఎస్‌ కట్టుబడి ఉందన్నారు. ‘పర్యాటక, పారిశ్రామికాభివృద్ధిని పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్లతోపాటు ఒక పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను ఇండియన్‌ హోటల్స్‌ (టాటా గ్రూప్‌) అన్వేషిస్తోంది. మరోవైపు రూ.40 వేల కోట్ల భారీ పెట్టుబడితో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పి 5 గిగా వాట్ల విద్యుదుత్పత్తికి టాటా పవర్‌ అంచనాలు రూపొందిస్తోంది. ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్‌ టెక్‌, ఏఐ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించడానికి సమాలోచనలు చేశాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.

పలు రంగాల్లో టాటా గ్రూప్‌ చేయూత: లోకేశ్‌

స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌లో భాగంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో టాటా గ్రూప్‌ కీలక భాగస్వామి కానుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. మౌలిక వసతులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాల్లో చేయూతనివ్వనుందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 04:59 AM