ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏయే సీట్లు అడగొచ్చు!?

ABN, First Publish Date - 2024-02-06T19:58:48+05:30

AP Election 2024: టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీతో పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది..

ఢిల్లీ: టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీతో పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎన్ని ఎంపీ స్థానాలు అడగాలి? ఎక్కడెక్కడ పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి? అభ్యర్దులుగా ఎవరెవరు ఉన్నారనే విషయమై అమిత్ షా నేతల నుంచి సమాచారం తీసుకుంటున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి పలు దఫాలుగా పలువురు నేతలతో విడివిడిగా అమిత్ షా భేటీలు జరుపుతున్నారు.

కీలక సమాచారాన్ని సేకరిస్తున్న అమిత్ షా..

రేపు (ఫిబ్రవరి-7న) తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ రానున్న నేపథ్యంలో... ఆయనతో చర్చించాల్సిన అంశాలను కూడా అమిత్ షా ఖరారు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన స్థానాల జాబితాను నేతలు సిద్దం చేస్తున్నారు. చంద్రబాబుతో చర్చల్లో ప్రతిపాదించాల్సిన ఎంపీ సీట్లపై పార్టీ నేతల నుంచి కీలక సమాచారాన్ని అమిత్ షా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అదే సందర్భంలో... పలు సర్వే సంస్థలు ఇప్పటి వరకూ జరిపిన సర్వేలు, ఒక్కో పార్టీ పరిస్థితి, ముఖ్యంగా బీజేపీ పరిస్థితి ఏంటో కూడా అమిత్‌ షా నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ ప్రతిపాదనలో ఉన్న పార్లమెంటు స్థానాలివే..

బీజేపీ ప్రతిపాదనలో ... అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపూర్‌ పార్లమెంటు స్థానాలున్నాయి. గతంలో గెలిచిన స్థానాలనే బీజేపీ ఎక్కువగా పట్టుబట్టే అవకాశం ఉంది. గతంలో గెలిచిన ఎమ్మెల్యే స్థానాలతో కలిపి.. 10 అసెంబ్లీ స్థానాలు అడగాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు వచ్చిన తర్వాత.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల సంఖ్యపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం, సీట్ల సర్దుబాటు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపాయి. కమిటీలో బీజేపీ నుంచి జాతీయ స్థాయి నేతలు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2024-02-06T20:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising