ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

ABN, Publish Date - Jun 05 , 2024 | 06:47 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందులోభాగంగా తాజాగా ఆ యా పార్టీల నేతలు, అధినేతలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. సేవలను ఈ సారి వినియోగించుకోవాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబును ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం.


అయితే చంద్రబాబు గతంలో.. అంటే రెండు దశాబ్దాలు క్రితమే ఎన్డీయే కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పారు. అందులోభాగంగా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడంలో తనకు తానే సాటి అని ఆయన ఆ సమయంలో నిరూపించుకున్నారు. అలాగే దేశ ప్రధానులు హెడ్.డి.దేవగౌడ, ఐకే.గుజ్రాల్‌ను ఎంపిక చేయడంలో సైతం చంద్రబాబు తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారు. అదే విధంగా దేశ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం ఎంపిక కావడంలో సైతం ఇదే తరహాలో చంద్రబాబు వ్యవహరించారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌గా అమలాపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగిని ఎంపిక చేయడంలో చంద్రబాబు చూపిన రాజకీయ పరిణితి అందరికీ అదర్శమైన విషయం విదితమే.


అదీకాక తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిలోని బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో టీడీపీ, జేడీ(యూ)లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించనున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే.. కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, వాటి మధ్య సంబంధాలపై చంద్రబాబుకు స్పష్టమైన అవగాహన ఉందని చెబుతున్నారు. కానీ అదే జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు చంద్రబాబు ఉన్నంతా రాజకీయ పరిణితి లేదనే అభిప్రాయం సదరు వర్గాల్లో వ్యక్తమవుతుంది.


ఇంకా చెప్పాలంటే.. ఇండియా కూటమి ఏర్పాటులో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ వ్యవహరించారని చెబుతున్నారు. అయితే ఇండియా కూటమి కన్వీనర్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేని ఎంపిక చేశారని సదరు వర్గం వివరిస్తుంది. దీంతో అలిగిన ఈ జేడీయూ అధినేత నితీష్.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేశారని పేర్కొంటుంది. అనంతరం మళ్లీ ఆయన దృష్టి ఎన్డీయే కూటమిపై పడిందని తెలిపిందే.

దీంతో ఆ కూటమిలో నితీష్ కుమార్ మళ్లీ చేరిపోయారని సోదాహరణగా వివరిస్తున్నారు. ఇటువంటి చర్యలతో నితీష్ కుమారు రాజకీయ మకిలి అంటించుకున్నారని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందనే అభిప్రాయం సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా నారా చంద్రబాబు పవర్ సెంటర్‌గా పాలిటిక్స్ ప్రారంభంకానున్నాయని రాజకీయ వర్గాలు క్లారిటీగా వివరిస్తున్నాయి.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 05 , 2024 | 07:43 PM

Advertising
Advertising