వైసీపీ నేతల భూకబ్జాలకు అంతేలేదు
ABN, Publish Date - Oct 25 , 2024 | 05:16 AM
దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుంటే.. దానిపై కేసులు పెట్టినా నాడు పోలీసులు పట్టించుకోలేదని, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధించారని
చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుంటే.. దానిపై కేసులు పెట్టినా నాడు పోలీసులు పట్టించుకోలేదని, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధించారని టీడీపీ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు టీడీపీ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు.
గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మంత్రి టీజీ భరత్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాంచినబాబు అర్జీలు స్వీకరించారు. పెద్దిరెడ్డి సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి తన భూములను ఆక్రమించుకున్నారని, దానికి అప్పటి అధికారులు సహకరించారని.. తమ భూమిని ఇప్పించాలని చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన కె.చోలేశ్వరరావు కోరారు.ఙ
Updated Date - Oct 25 , 2024 | 05:16 AM