ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : ప్రాజెక్టు కమిటీల చైర్మన్‌ పదవులపై కసరత్తు

ABN, Publish Date - Dec 21 , 2024 | 06:19 AM

సాగునీటి సంఘాలకు పైస్థాయిలో ఉండే ప్రాజెక్టు కమిటీల చైర్మన్‌ పదవులపై తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా కసరత్తు నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు..

  • టీడీపీలో అంతర్గతంగా పెరిగిన పోటీ

  • మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

  • అన్ని జిల్లాల్లోనూ ఏకాభిప్రాయం: పల్లా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాలకు పైస్థాయిలో ఉండే ప్రాజెక్టు కమిటీల చైర్మన్‌ పదవులపై తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా కసరత్తు నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకవిడత పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని చర్చించారు. తర్వాత అన్ని జిల్లాల మంత్రులతో పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపికకు సూచనలు చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 58 ప్రాజెక్టు కమిటీలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. వీటికి దిగువ స్థాయిలో ఉన్న ప్రాథమిక నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ స్థాయి సంఘాల ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటికి ఎగువన ఉన్న ప్రాజెక్టు కమిటీలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రాజెక్టు కమిటీలు కొన్నిచోట్ల జిల్లాల సరిహద్దులు దాటి రెండేసి జిల్లాలకు ఒకటి చొప్పున ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో మూడు నాలుగు నియోజకవర్గాలకు కలిపి ఉన్నాయి. ఇవి పెద్ద పదవులు కావడంతో టీడీపీలో పోటీ పెరిగింది. పైగా దిగువ స్థాయి కమిటీలన్నీ కూటమి పార్టీలకే దక్కడంతో ప్రాజెక్టు కమిటీ పదవుల ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. ఎన్నికైన వారి పదవీకాలం ఐదేళ్లు. పోటీ తీవ్రంగా ఉన్న మూడునాలుగు చోట్ల చెరి సగం కాలానికి పంచుకొనేలా కూడా ఒప్పందాలు కుదురుతున్నట్లు సమాచారం.


కొన్ని చోట్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చెరొక పార్టీకి ఇస్తున్నారు. నియోజకవర్గ నేతలకు ఈ పదవులు దక్కడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుండటంతో వారి మధ్య అంతర్గత పోటీ నెలకొంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కొన్ని చోట్ల మిత్రపక్షాలకు కూడా చోటిస్తూ కసరత్తు నిర్వహించారు. వీలైనంత వరకూ సామాజిక సమతూకం, ప్రాంతీయ కోణాలు చూసి ఎంపిక చేశారు. ఒకటి రెండు చోట్ల ప్రతిపాదిత అభ్యర్థులపై ఫిర్యాదులు రావడంతో వారిని మార్చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక అభ్యర్థిపై రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ కేసులు ఉండటంతో అతన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులపై ఏకాభిప్రాయం వచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Dec 21 , 2024 | 06:19 AM