లడ్డూపై వాస్తవాలే చెప్పండి
ABN, Publish Date - Oct 01 , 2024 | 03:52 AM
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపఽథ్యంలో తమ నేతలకు తెలుగుదేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలు చెప్పండి గానీ.. కోర్టులపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.
కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు
పార్టీ నేతలకు నాయకత్వం ఆదేశం
సీఎం చంద్రబాబు స్వామిభక్తుడు
కల్తీని ల్యాబ్ నిర్ధారించాకే స్పందించారు
వాస్తవాలు తేల్చడానికే సిట్ వేశారు: టీడీపీ
తిరుమల పవిత్రతపై రాజీపడం టీడీపీ నాయకుల స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపఽథ్యంలో తమ నేతలకు తెలుగుదేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలు చెప్పండి గానీ.. కోర్టులపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలకు ఇక్కడి కేంద్ర కార్యాలయంలో నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేసింది. ‘కోర్టు వ్యాఖ్యలపై నేరుగా విమర్శలు చేయొద్దు. కోర్టులను తక్కువ చేసేలా మాట్లాడొద్దు. న్యాయమూర్తులు ఎవరు.. ఎందరు సభ్యుల ధర్మాసనం అనే అంశాల జోలికి పోవద్దు. ప్రజలకు వివరణ ఇవ్వండి. అంతేతప్ప కోర్టులను విమర్శించే ప్రయత్నం చేయవద్దు’ అని పేర్కొన్నట్లు సమాచారం.
తిరుమల ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక ప్రతిష్ఠాత్మక ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు తప్ప ముందుగానే ఎటువంటి విమర్శా చేయలేదన్న అంశాన్ని టీవీల్లో చర్చలు, ఇతర వేదికలపై ప్రస్తావించాలని నాయకత్వం సూచించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత పార్టీ నేతల స్పందన ఎలా ఉండాలన్నదానిపై పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల మధ్య చర్చ జరిగింది. ‘తిరుమలకు ఒక కంపెనీ నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. అందులో 4 ట్యాంకర్ల నెయ్యి వాడారు. అనుమానం రావడంతో మరో 4 ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డు (ఎన్‌డీబీబీ) ల్యాబ్‌కు పంపారు. కల్తీ జరిగిందని ఆ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపారు.
ఇంత పెద్ద అంశంలో మౌనంగా ఉండడం మంచిది కాదన్న భావంతో బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రజలకు వాస్తవాలు చెప్పారు. బయటకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే అది మరో తప్పయ్యేది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి బయటపెట్టారు. విషయం తెలిశాక కూడా దానిని రహస్యంగా ఉంచి.. అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యేది. ఆ తప్పును బయటపెట్టడంతోపాటు దానికి ప్రక్షాళనగా ఏం చేయాలో కూడా ముఖ్యమంత్రి చేశారు. వాస్తవాలన్నీ తేల్చడానికే సిట్ ఏర్పాటు చేశారు’ అని ఒక నేత పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా చంద్రబాబు వేంకటేశ్వరస్వామి భక్తుడని, ఆవేదనతోనే ఆయన కల్తీ విషయం బయట పెట్టారని మరో నాయకుడు అన్నారు. ‘ముఖ్యమంత్రి తాను మాట్లాడిన రోజు కేవలం కల్తీ జరిగిందనే చెప్పలేదు. తర్వాత తీసుకున్న జాగ్రత్తలు, ఇప్పుడు నాణ్యత ఎలా ఉందో కూడా చెప్పి భక్తులు, ప్రజల్లో ఉన్న అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలను, మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశారు. తిరుమల పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఏనాడూ రాజీపడలేదు. రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం పూర్తిగా ఆలయ నిబంధనలకు, మత విశ్వాసాలకు, ఆగమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటుంది. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతుంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. తప్పును ఎత్తి చూపుతోంది. అదే సమయంలో ఆ తప్పు దిద్దడానికి ఏం చర్యలు తీసుకుంటోందో కూడా చెబుతోంది. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా వ్యవహరిస్తోంది’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
హైకోర్టులో ఏఆర్ ఫుడ్స్ ఎండీపిటిషన్
తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలతో టీటీడీ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నమోదు చేసి న కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజశేఖరన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) చట్టనిబంధనలకు అనుగుణంగా నెయ్యి శాంపిల్ సేకరణ, విశ్లేషణ జరుగలేదని తెలిపారు.
‘నెయ్యి కల్తీ ఆరోపణలపై నా నుంచి ఎలాంటి వివర ణా తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఎఫ్‌ఐఆర్‌లో నాపై మోపిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవు. పోలీసులు న మోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. రాజకీయ కారణాలతో కేసు పెట్టారు. నన్ను అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. దర్యాప్తునకు సహకరిం చేందుకు సిద్ధంగా ఉన్నాను. ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటాను. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వండి’ అని రాజశేఖరన్ పిటిషన్‌లో కోరారు.
Updated Date - Oct 01 , 2024 | 03:52 AM