AP Politics: జగన్ నోట పచ్చి అబద్ధాలు.. ఫినాయిల్‌తో నోరు కడుక్కో : ఆనం వెంకట రమణారెడ్డి
ABN, Publish Date - Jan 30 , 2024 | 02:22 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan) టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు. 2006లో రూ.లక్షతో ప్రారంభించిన సాక్షి మీడియా ఇప్పుడు వేల కోట్ల లాభం ఎలా పొందగలిగిందని నిలదీశారు. ఆ చిట్కా ఏదో ఇతరులకు చెబితే బాగుంటుందని సూచించారు. సాక్షి మీడియాలో తనకు సగం వాటా ఉందని నిన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆ క్రమంలో ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.
సాక్షి ఎవరిదీ..?
సాక్షి మీడియా తనది కాదని సీఎం జగన్ అప్పుడప్పుడు అంటుంటారు. ‘సాక్షి ఎవరిదీ..? నీదు కాదు, నీ భార్య భారతికి సంబంధం లేదు, నీ కూతుళ్లకు వాటా లేదు. నీ బావ మరిది దినేశ్ రెడ్డికి చెందింది కాదు.. ఇంతకి సాక్షి మీడియా ఎవరిదీ..? అని’ అనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను 2006లో ప్రారంభించారని ఆనం వెంకట రమణారెడ్డి గుర్తుచేశారు. రూ.లక్షతో ప్రారంభించామని చెబుతారు. విజయసాయిరెడ్డి రూ.30 వేలు, జగన్ రూ.30 వేలు, కామత్ రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని వివరించారు. 2007 వరకు సాక్షి డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నారు. తర్వాత జగన్, ఆయన తర్వాత వైఎస్ భారతి డైరెక్టర్లుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి 2015వరకు డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. రూ.లక్ష పెట్టుబడితో మొదలైన సాక్షి సంస్థ ఇప్పుడు వేల కోట్లకు పడగలేత్తిందని విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 30 , 2024 | 02:22 PM