Kollu Ravindra: జగన్, మంత్రులవి పిచ్చి ప్రేలాపనలు
ABN, Publish Date - Jan 08 , 2024 | 02:03 PM
Andhrapradesh: ‘రా...కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పను - మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు.
అమరావతి: ‘రా...కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పను - మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే?అని ప్రశ్నించారు.
మాట తప్పకపోవడం అంటే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో తొలిస్థానంలో నిలపడమా? అని అన్నారు. మడమ తిప్పకపోవడమంటే, మద్యనిషేధం అని చెప్పి మహిళల తాళిబొట్లు తెంచడమా అని నిలదీశారు. సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేయడమేనా జగన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర రక్తచరిత్ర పేరుతో బాబాయ్ మరణాన్ని టీడీపీపై నెట్టడమేనా విశ్వసనీయత అంటే అని ప్రశ్నల వర్షం కురిపించారు.
‘జయహో బీసీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ 962 మండలస్థాయి సమావేశాలు నిర్వహించనుందని తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలకు బాగా నచ్చాయన్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల సంతోషం, రాష్ట్ర సంక్షేమమే లక్ష్యగా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 08 , 2024 | 02:03 PM