ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy: జగన్ చెప్పిన స్టార్‌ క్యాంపెయినర్లపై సోమిరెడ్డి వ్యంగ్య ట్వీట్

ABN, Publish Date - Jan 23 , 2024 | 03:18 PM

Andhrapradesh: ఉరవకొండ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ల అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమరావతి, జనవరి 23: ఉరవకొండ సభలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) చెప్పిన స్టార్ క్యాంపెయినర్ల అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (TDP Leader Somireddy Chandramohan Reddy) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఈ రోజు జగన్ చెప్పింది 100 శాతం నిజమని.. 2024 ఎన్నికలకు జనమే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఎన్నికల యుద్ధంలో సామాన్య ప్రజలే స్టార్ క్యాపెంయినర్లన్నారు. జగన్‌ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. దగా పడ్డ ప్రతి అన్నదాత ఒక స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. ప్రభుత్వ బాదుడుతో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్ అన్నారు. అణిచివేతకు గురైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుడు కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్లు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌ ట్వీట్ చేశారు.


ఇంతకీ జగన్ ఏమన్నారంటే..

ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. చంద్రబాబుకు స్టార్ క్యాంపెనర్లు ఉన్నారని.. పక్క రాష్ట్రంలో నివసిస్తున్న పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, ముగ్గురు మీడియా అధిపతులు చంద్రబాబు నాయుడుకు స్టార్ క్యాంపెనర్లే అంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌లో చంద్రబాబు స్టార్ క్యాంపెనర్లు ఉన్నారని అన్నారు. చంద్రబాబు కోసం పనిచేసే స్టార్ క్యాంపెనర్లు మేధావులుగా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న మీ బిడ్డకు స్టార్ క్యాంపెనర్లు లేరు. మీ బిడ్డకు ఉన్న స్టార్ క్యాంపెనర్లు మీరే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2024 | 03:23 PM

Advertising
Advertising