ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: జగన్ ఔట్, చంద్రబాబు ఇన్..తప్పు చేస్తే వదిలేది లేదు

ABN, Publish Date - May 16 , 2024 | 07:37 PM

రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. అందుకోసమే కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేదని ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.

tdp leader Varla Ramaiah

రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. అందుకోసమే కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు కొంతమంది అధికారులు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆతృత పడుతున్నారని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఫైల్స్, మ్యాన్యువల్ ఫైల్స్ ఏవీ తరలించొద్దని, ఈ ఆఫీసు మూసివేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.


పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్‌లు తగలబెడుతున్నారు, కేస్ ఫైల్స్(files) ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారని వర్ల రామయ్య నిలదీశారు. ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయోద్దని డీజీపీ అన్ని స్టేషన్లకు ఆర్డర్ పాస్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అధికారులు ఫైళ్లను మార్చవద్దని, ధ్వంసం చేయోద్దని కోరారు. అంతేకాదు సెక్రటేరియేట్‌లోని ప్రిన్స్ పల్ సెక్రటరీలు ఏ ఫైల్ కూడా మార్పు చేయడానికి వీలులేదని కింది అధికారులకు ఆదేశాలివ్వాలని సూచించారు.


మాచర్ల దాడులు, నరసరావుపేట అఘాయిత్యాలు, చంద్రగిరి హత్యాయత్నాలు, తాడిపత్రి తగులబడడం గమనిస్తున్నామని అన్నారు. తెలిసి తప్పు చేసిన వారిని వదిలేది లేదని వెల్లడించారు. ఇప్పటికే శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు. విధులు నిర్వహించకుండా పెద్దారెడ్డికి డీఎస్పీ చైతన్య తాబేదారుగా పనిచేశారని ఎద్దేవా చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసి దివ్యాంగుడైన కిరణ్‌ని ఇష్టమొచ్చినట్లు కొట్టారని గుర్తు చేశారు.


కొల్లు రఘురామిరెడ్డి గతంలో పైల్స్ తగలబెట్టినట్లు చాలామంది ఫైళ్లు ధ్వంసం చేసే ప్రమాదముందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ చైతన్యను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కావాలని తప్పు చేసిన ఏ అధికారిని కూడా వదలమని, వారంతా తగిన మూల్యం చెల్లించక తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేదని ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.


ఇవి కూడా చదవండి...

TDP: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 08:01 PM

Advertising
Advertising