Fake Voters: దొంగ ఓట్లకు కారకులైన పాలకులపై కూడా చర్యలు తీసుకోవాలి..కేంద్ర ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు
ABN, Publish Date - Jan 20 , 2024 | 04:08 PM
ఏపీలో నకిలీ ఓట్ల అంశం క్రమంగా మరింత వేడెక్కుతోంది. 2021 తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఫేక్ ఓట్లు ఉన్నాయని తేలడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్‌ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం దొంగ ఓట్ల అంశం గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.
ఏపీలో నకిలీ ఓట్ల అంశం క్రమంగా మరింత వేడెక్కుతోంది. 2021 తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఫేక్ ఓట్లు ఉన్నాయని తేలడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్‌ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం దొంగ ఓట్ల అంశం గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య దొంగ ఓట్లకు కారకులైన నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతోపాటు 2023 మార్చిలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై కూడా ప్రస్తావించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నాయకులు అధికారుల సహకారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. గ్రాడ్యుయేట్లు కానీ వారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. కానీ అక్రమాలకు పాల్పడిన అధికారపార్టీ నేతలపై గానీ, అధికారులపై గానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతీ పిర్యాదుతోపాటు ఆధారాలను సైతం ఎలక్షన్ కమిషన్‌కు పంపామని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఓ ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 171 డి, రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట్-1950 ప్రకారం ఇద్దరు తిరుపతి మునిసిపల్ కార్పొరేటర్లపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారని తెలిపారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు వర్ల రామయ్య. దొంగ సర్టిఫికేట్లతో గ్రాడ్యుయేట్లుగా సర్టిఫై చేసి ఓటు హక్కు కల్పించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందారన్న సమాచారం అడిగినప్పటికీ నేటికి కూడా ఇవ్వలేదని చెప్పారు.
అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై బోగస్ ఓట్లు నమోదు చేసి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరోసారి కోరినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. అంతేకాదు తిరుపతి ఉప ఎన్నికల్లో గిరీషాతో పాటు అనేక మంది అధికారులు, అధికారపార్టీ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో అధికార వైఎస్సార్ పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి దొంగ ఓటు ఎపిక్ కార్డుల ముద్రణకు కారణమైన పాలకులపైన కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఇంఛార్జ్ సుగుణమ్మ తెలిపారు. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. చిన్న చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకుని ఎన్నికల కమిషన్ మిన్నకుంటే సరిపోదని అన్నారు. నకిలీ ఎపిక్ కార్డులకు కారకుడైన భూమన అభినయ రెడ్డిని ఎన్నికలకు అనర్హుడిని చేయాలని కోరారు. అంతేకాదు తిరుపతి నగరంలో ఆదార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేయాలని సూచించారు.
Updated Date - Jan 20 , 2024 | 04:08 PM