ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

kakinada: వేదిక కూలి కింద పడ్డ ఎమ్మెల్యేలు.. స్వల్ప గాయాలు

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:44 PM

కాకినాడ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు కేడర్ హాజరయింది.

కాకినాడ, డిసెంబర్ 15: కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం జరుగుతోండగా ప్రమాణ స్వీకార వేదిక ఒక్కసారిగా కుప్పుకూలింది. దీంతో వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కింద పడిపోయారు. దాంతో చిన్నరాజప్పతోపాటు పంతం నానాజీకి స్వల్ప గాయాలయ్యాయి.

Also Read:పైసల కోసం వెళ్లినోడు నాయకుడా?

Also Read: నేడు నాగపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం


ఆదివారం కాకినాడ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు కేడర్ హాజరయింది. ఆ క్రమంలో ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం తుమ్మల బాబుకు వేద పండితులు ఆశీర్వాదం ఇస్తుండగా.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

Also Read: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

Also Read: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్


అయితే వేదిక కుప్పకూలి పోవడంతో.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమి అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు.. వెంటనే స్పందించారు. కింద పడిపోయిన ఎమ్మెల్యేలను లేపి కూర్చిల్లో కూర్చోబెట్టారు. అయితే 50 మంది కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి దాదాపు 200 మందికిపైగా అనుచరులు ఒకే సారి ఎక్కేశారని.. దీంతో బరువు తట్టుకో లేక వేదిక కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు ఈ సందర్భంగా వెల్లడించారు.

Also Read: కేసీఆర్ ఫ్యామిలీ నాటకం.. యువత బలిదానాలకు కారణం


మరోవైపు ఈ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా పిఠాపురం నుంచి కాకినాడలోని కుడా కార్యాలయం వరకు వందలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక కార్యకర్తలు 108కి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనుకోకుండా చోటు చేసుకున్న ఘటన కావడంతో.. పార్టీ శ్రేణులు ఒకింత షాక్‌కు గురయ్యారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 03:09 PM