ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Floods: మరో సారి స్పందించిన బుద్దా వెంకన్న

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:40 PM

విజయవాడ నగరానికి భారీగా వరద నీరు పోటెత్తడం వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఉన్నాయి. వారిని ఆదుకొనేందుకు మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందుకు వచ్చారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ శ్రేణులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారీ బుద్దా వెంకన్న.

విజయవాడ, సెప్టెంబర్ 13: ఎడ తెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరానికి వరద నీరు పొటెత్తడంతో వేలాది మంది సర్వం కోల్పోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలి పనులు చేసుకునే వారు సైతం ఆ జాబితాలో ఉన్నారన్నారు. నగర ప్రజల కష్టాలు, బాధలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తన వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 లక్షల విరాళంగా అందజేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Also Read: AP Rains: వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఐటీడీపీ


తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. పోరాటాలు చేసిన కార్యకర్తలు సైతం ఈ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని సోదాహరణగా వివరించారు. దాంతో టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను ఆదుకునేందుకు తాను మళ్లీ ముందుకు వచ్చినట్లు చెప్పారు. వారి నివాసాల్లోని టీవీలు, ఫ్రీజ్‌లతోపాటు ఇతర గృహోపకరణాలు సైతం పాడైపోయాయని తెలిపారు. వారందరికీ తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆ యా వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు సైతం చేసినట్లు ప్రకటించారు.

Also Read: YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు


అయితే తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నానన్నారు. ఆ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తాను ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో తాను రాలేక పోయినా.. టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలకు తన వంతుగా ఈ సాయం అందిస్తున్నాట్లు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వివరించారు. ఇంక ఎవరైనా తనతో కలిసి నడిచి.. పార్టీ కోసం పని చేసి వరదల్లో నష్టపోయిన వారి వివరాలను తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వారందరికీ తన వంతుగా తప్పకుండా సాయం అందిస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం


ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో మరణాలు సైతం సంభవించాయి.

Also Read: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నాటి ఈడీ సమన్లు నుంచి నేటి బెయిల్ వరకు..


ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన విషయం విధితమే. అయితే ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడంతో.. వేలాది నివాసాల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు ఇతర గృహోపకరాణాలు పాడైపోయాయి. వాటిని సైతం మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అలాంటి వేళ.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైతం.. నేను సైతం అంటూ విజయవాడలోని వరదలపై మరోసారి స్పందించారు.

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 13 , 2024 | 05:49 PM

Advertising
Advertising