ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం..

ABN, Publish Date - Jul 01 , 2024 | 12:01 PM

రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తింది. సర్వర్‌లో సాంకేతిక లోపంతో పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. సర్వర్ లోపంపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెక్నికల్ విభాగంలో ఇంకా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే ఇదంతా మానవ తప్పిదమా... లేక సాంకేతిక లోపమా అన్న అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తింది. సర్వర్‌లో సాంకేతిక లోపంతో పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. సర్వర్ లోపంపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెక్నికల్ విభాగంలో ఇంకా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే ఇదంతా మానవ తప్పిదమా... లేక సాంకేతిక లోపమా అన్న అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. కావాలని చేశారా అన్న అంశంపై అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇక అధికారులు గంటన్నర సేపు ప్రయాస పడి సర్వర్‌ లోపాన్ని తొలగించి పెన్షన్లు తిరిగి పంపిణీ చేస్తున్నారు.


మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలోనూ.. సర్వర్ స్లో అవడంతో పింఛన్ల పంపిణీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పింఛన్లు పంపిణీ చేసే ఉద్యోగి లాగిన్ అవ్వాలన్నా... పింఛను పొందే వ్యక్తి వేలిముద్ర వేయాలన్నా సర్వర్ పని చేస్తేనే పంపిణీ జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల వరకూ 200 పైగా పింఛన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ మూడు లేదా నాలుగు పింఛన్లు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది.

Updated Date - Jul 01 , 2024 | 12:01 PM

Advertising
Advertising