AP High Court: జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా
ABN, Publish Date - Nov 11 , 2024 | 09:42 PM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ 2024 25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష హోదా కేటాయించక పోవడంతో.. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానని ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ.. వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే తమకు నోటీసులు అందలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలియజేశారు.
Also Read: ఏపీకి భారీగా పెట్టుబడులు.. యూత్‌కు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్..
దీంతో చిరునామా సరిగ్గా లేదని నోటీసును స్పీకర్ కార్యదర్శి తిరస్కరించారని జగన్ తరఫు న్యాయవాది సుమన్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతి వాదులుగా పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం వైఎస్ జగన్ పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Also Read: AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్
ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. దాంతో ప్రతిపక్ష హోదా సైతం ఆ పార్టీకి దక్కలేదు.
Also Read: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు
Also Read: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ
అలాంటి వేళ.. తమకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ సైతం రాశారు. కానీ సంఖ్య బలం లేకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని వైఎస్ జగన్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించేలా.. అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిందీ హైకోర్టు.
Also Read: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ 2024 25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష హోదా కేటాయించక పోవడంతో.. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానని ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తన నివాసంలోని మీడియా పాయింట్ నుంచి కూటమి ప్రభుత్వంలోని ఎత్తి చూపుతానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 09:42 PM