Share News

Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో.. కీలక పరిణామం

ABN , Publish Date - Dec 30 , 2024 | 08:35 PM

Ration Rice Case: బందరులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పలువురి అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మాయమైన బియ్యం బస్తాలు.. కాకినాడ పోర్ట్ ద్వారా తరలించినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం.

Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో.. కీలక పరిణామం

మచిలీపట్నం, డిసెంబర్ 30: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ కేసులో నిందితుల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజతోపాటు సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావుతోపాటు రైస్ మిల్లర్ ఆంజనేయులును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో వారి అరెస్ట్ చూపించి.. న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే కేసులో ఏ1 గా ఉన్న పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం జిల్లా కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఇక పేర్ని జయసుధ గోడౌన్‌లో మాయమైన 7557 బస్తాల బియ్యం.. కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణాకు పాల్పడ్డారని విచారణలో నిందితులు ఒప్పుకొన్నట్లు సమాచారం. వీరు అరెస్ట్ అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి పేర్లు బహిర్గతమవుతాయనే ప్రచారం సాగుతోంది.


అదీకాక.. గోడౌన్లలో మరో వందకు పైగా రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో మరో కోటికి పైగా పెనాల్టీ చెల్లించాల్సి ఉందంటూ ఇప్పటికే పేర్ని జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. మరోవైపు కోన్ని బస్తాల మాయం కేసులో ఇప్పటికే రూ. కోటి డైబ్బయి లక్షల డీడీ ప్రభుత్వానికి చెల్లించిన సంగతి తెలిసిందే.

Also Read :సైంధవ లవణంతో ఇన్ని లాభాలున్నాయా..?

Also Read :పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్

Also Read: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక

Also Read: కొత్త ఏడాదిలో వారిద్దరికి సినిమా చూపిస్తాం

Also Read: రేవంత్ ఈగో చల్లబడింది..

Also Read: చిన్మయ దాస్ తీవ్ర అనారోగ్యం.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్‌కు వినతి

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 08:35 PM