Chandrababu: హెచ్‌వోడీల సమావేశంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 13 , 2024 | 07:28 PM
వివిధ శాఖాధిపతుల హెచ్‌వోడీల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు 1995లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు అంటే గౌరవం ఉండేది. కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ గాడి తప్పింది’’ అని అన్నారు.
అమరావతి: వివిధ శాఖాధిపతుల హెచ్‌వోడీల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు 1995లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు అంటే గౌరవం ఉండేది. కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ గాడి తప్పింది. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో గాడీలో పెడతాను. ఆనాడు 1995లో అధికారులు నిబంధనలు ప్రకారం వ్యవహరించేవారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని, కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ‘‘నాకు ప్రస్తుతం సమయం లేదు. రెండు మూడు రోజులు తర్వాత మరోసారి కలుద్దాం’’ అని చంద్రబాబు అన్నారు. కాగా ఈ సమావేశానికి గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన కొంతమంది అధికారులు కూడా వచ్చారు. అయితే ఆ అధికారులు కూడా వచ్చారనే విషయాన్ని చంద్రబాబుకు పేషీ అధికారులు ముందుగానే చెప్పారు. దీంతో చంద్రబాబు మూడు నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారని తెలుస్తోంది.
Updated Date - Jun 13 , 2024 | 07:28 PM