AP News: మద్యం మత్తులో కనిపించిన వాహనాలను ఢీకొట్టి..
ABN, Publish Date - May 31 , 2024 | 07:25 AM
మద్యం మత్తులో విచక్షణ లేకుండా కారు నడిపి ప్రజల జీవితాలతో కొందరు యువకులు చెలగాటమాడుతున్నారు. తాజాగా నెల్లూరులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఫూటుగా మద్యం సేవించి రోడ్డుపై కనిపించిన వాహనాన్నల్లా గుద్దుకుంటూ వెళ్లిపోయాడు.
నెల్లూరు: మద్యం మత్తులో విచక్షణ లేకుండా కారు నడిపి ప్రజల జీవితాలతో కొందరు యువకులు చెలగాటమాడుతున్నారు. తాజాగా నెల్లూరులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఫూటుగా మద్యం సేవించి రోడ్డుపై కనిపించిన వాహనాన్నల్లా గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. అసలు విషయంలోకి వెళితే.. గూడూరులో ఢిల్లీకి చెందిన కారు ఒకటి భీభత్సం సృష్టించింది.
జగన్ కక్ష ఏబీవీకి ఐదేళ్ల శిక్ష
గూడూరు రైల్వే స్టేషన్ నుంచి సంగం సినిమా హాలు వరకు అడ్డొచ్చిన వాహనాలను ఢీ కొట్టుకుంటూ వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా.. ఒక వ్యక్తి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసి ఆకాష్ అనే యువకుడు బీభత్సం సృష్టించాడు. ఆకాష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 31 , 2024 | 07:25 AM