ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

ABN, Publish Date - May 10 , 2024 | 03:44 AM

దార్శనికులు ఉజ్వల భవిష్యత్‌కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్‌ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్‌రెడ్డి.

చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

ఒకరిది అభివృద్ధి, నిర్మాణ పథం

మరొకరిది ఫ్యూడల్‌ మనస్తత్వం

కూల్చివేతలు, పగాప్రతీకారాలు

దార్శనికులు ఉజ్వల భవిష్యత్‌కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్‌ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్‌రెడ్డి. చంద్రబాబు, జగన్‌ లక్షణాలను పరిశీలిస్తే ఇద్దరి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. వారు చేసిన పనులే చంద్రబాబును నిర్మాతగా, జగన్‌ను విధ్వంసకారుడిగా నిలిపాయి. చంద్రబాబు, జగన్‌ పనితీరును పరిశీలిస్తే ఎవరి పేరు చెబితే ఏమేమి గుర్తుకొస్తాయో చూద్దాం...

  • సైబరాబాద్‌ నిర్మాణం

తొండలు గుడ్లు పెట్టే ప్రాంతంలో ఒక ఆధునిక నగర నిర్మాణం చేపట్టి ఐటీ అగ్రగామి చిరునామాల్లో ఒకటిగా సైబరాబాద్‌ను నిలిపిన ఘనత చంద్రబాబుదే. సైబరాబాద్‌ అంటేనే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది. మైక్రోసా్‌ఫ్టలాంటి సంస్థలను రప్పించారు. హైదరాబాద్‌ ఐటీ నగరంగా మారడం వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. ఆయన చేసిన కృషి వల్ల నేడు తెలంగాణలో ఐటీ రంగంలోనే ప్రత్యక్షంగా 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా, అనుబంధ రంగాలు, ఆధార రంగాల్లో అంతకు అనేక రెట్లు ఉపాధి లభిస్తోంది.

చంద్రబాబు పేరు వింటే.. విజన్‌, అభివృద్ధి, ఉపాధి, సుపరిపాలన వంటివి గుర్తుకొస్తాయి. ఆయన పాలనలో చిరకాలం గుర్తుండిపోయే అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నవ్యాంధ్రను ఓ దార్శనికుడిలా ముందుకు నడిపించారు.


  • సొంత వ్యాపార సామ్రాజ్యం

జగన్‌ కేసుల వల్లే క్విడ్‌ ప్రోకో (నాకిది-నీకిది) అనే పదం బాగా పాపులర్‌ అయింది. నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ మేళ్లు పొందిన వారి నుంచి రూ.వేల కోట్లను పెట్టుబడుల రూపంలో తన కంపెనీల్లో పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై డజన్ల కొద్దీ అవినీతి కేసులు నమోదయ్యాయి. 16 నెలలు జైలులో గడిపారు. హైదరాబాద్‌ నగరంలో ఓ వైపు చంద్రబాబు తీసుకొచ్చిన బహుళ జాతి ఐటీ కంపెనీలు, చేపట్టిన నిర్మాణాలు కనిపిస్తే... మరోవైపు జగన్‌ సొంతానికి నిర్మించుకున్న వ్యాపార సంస్థలు, సొంత రోత మీడియా భవనాలు దర్శనమిస్తాయి. జగన్‌ అవినీతి సొమ్ముతోనే వీటిని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.

జగన్‌ పేరు వింటే... క్విడ్‌ ప్రోకో ఆరోపణలు, అవినీతి కేసులు, కూల్చివేతలు, ప్రతీకారాలు వంటివి గుర్తుకొస్తాయి. ఆయన పాలనలో జరిగిన దోపిడీ, అరాచకాలు, విధ్వంసం అంతా ఇంతా కాదు. వినాశకర నిర్ణయాలతో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించారు.

చంద్రబాబు ప్రత్యేకతలు

  • క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, అకాడమీల ఏర్పాటుకు సహకారం, అనేక మంది చాంపియన్ల తయారు

  • హైదరాబాద్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఏర్పాటు, 1999లో చంద్రబాబు పునాది వేయగా, 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభోత్సవం

  • అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంస్థ హైటెక్స్‌-హెచ్‌ఐసీసీ చంద్రబాబు హయాంలో ఏర్పాటు

  • పరిపాలనలో పరివర్తన, ప్రజలే కేంద్రంగా విధానాల రూపకల్పన లక్ష్యాలుగా 2001లో చంద్రబాబు ప్రభుత్వం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను ఏర్పాటు

  • ప్రజల వద్దకే పాలనతో పరిపాలనలో వికేంద్రీకరణ తెచ్చి పారదర్శకత పెంచారు. సీఎంగా నేరుగా ప్రజల సమక్షంలో రియల్‌టైంలో సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు సంస్కరణలు తెచ్చారు.


  • దేశ చరిత్రలోనే తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగిని నియమించేందుకు కృషి చేసి సామాజిక సాధికారత సాధించారు.

  • మహిళా సాధికారత, స్వావలంబన, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, దళిత మహిళ ప్రతిభా భారతికి ఏపీ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా, బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను చిన్న వయసులోనే మేయర్‌గా చేసిన ఘనత చంద్రబాబుది

  • సీఎంగా చంద్రబాబు హుందాగా వ్యవహరించారు. పార్టీ వేరైనా సీనియర్లకు గౌరవమిచ్చారు. ప్రాజెక్టులు, పథకాలకు ప్రముఖుల పేర్లు మార్చకుండా ఉదారత ప్రదర్శించారు.

  • టెక్నాలజీ వినియోగంలో, అవినీతి నిర్మూలనలో, పారదర్శకత పెంపుదలలో చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

  • ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి సొంత భవనాల నిర్మాణాలకు చంద్రబాబు శ్రీకారం

  • నాటి పనికి ఆహార పథకం, నేటి ఉపాధి హామీ పథకాలను సద్వినియోగం చేసుకున్న చరిత్ర చంద్రబాబుది. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర పఽథకాన్ని వాడుకుని మౌలిక వసతులు కల్పన

  • ఒక మనిషికి ఒక చేప ఇచ్చి ఆ రోజుకు తిండి పెట్టేకంటే... అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం తనను తాను పోషించుకుంటాడన్న చైనా సూక్తిని అమలు చేసింది చంద్రబాబు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు.

  • శాంతిభద్రతల పరిరక్షణకు చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆయన హయాంలో ఫ్యాక్షనిస్టులకు, పేరుమోసిన రౌడీలకు డార్మెటరీ ట్రీట్‌మెంట్‌

  • కుల ప్రస్తావన లేని పాలన చంద్రబాబు చేశారు. సొంత కులం వాళ్లకు పదవులు ఇవ్వడానికి వెనుకాడే వారని టీడీపీ నేతలు చెబుతుంటారు.

  • చంద్రబాబును చూసి రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు. 2015 అక్టోబరు 8న అమరావతికి శంకుస్థాపన చేయగా, 2016 జూన్‌ నెలలో సచివాలయం అందుబాటులోకి వచ్చింది.

  • దేశానికి స్వాతంత్య్రం రాకముందే ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టులో నిర్మాణాత్మకమైన పనులు జరిగింది చంద్రబాబు హయాంలోనే

  • పట్టిసీమ అనే చిన్న ఆలోచనతో బహుళ ప్రయోజనాలు సాధించిన ఘనత చంద్రబాబుది

  • విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలనే యోచనతో ఐటీ, ఫార్మా, ఫిన్‌టెక్‌ కంపెనీలు ఏర్పాటు

  • బాబు పాలనలో అభివృద్ధిని స్పష్టంగా చూపించిన అంశాల్లో రోడ్లు ఒకటి. రాష్ట్ర రహదారులు, లింకు రోడ్లే కాదు... గ్రామాల్లో చిన్న వీధులు, సందుల్లోను సిమెంట్‌ రోడ్లు వేశారు. ప్రతి వీధిలోనూ ఎల్‌ఈడీ లైట్లు వెలుగులు నింపాయి.

  • చంద్రబాబు హయాంలో టీచర్‌ పోస్టులు, పోలీసుశాఖలో ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ, ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగేందుకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ

జగన్‌ అరాచకాలు

  • అకాడమీలపై కుల కక్ష, బూతుల చాంపియన్ల తయారు, వైసీపీ ఉత్సవంలా ఆడుదాం ఆంధ్రా

  • జగన్‌ సీఎం కాకమునుపే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన కోసం తోడువచ్చే ముఠాను తయారు చేసుకోవడం

  • చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను జగన్‌ ముఖ్యమంత్రి కాగానే కూల్చివేత

  • మోడల్‌ ఫర్‌ బ్యాడ్‌ గవర్నెన్స్‌, పారదర్శకంగా పాలిస్తానని ప్రమాణం చేసిన జగన్‌ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉత్తర్వులన్నీ రహస్యంగా ఉంచాలని ఆదేశించారు.

  • జగన్‌ సీఎం అయ్యాక ప్రజల్లోకి రావడమే మానేశారు. సచివాలయంలో సీఎం కార్యాలయానికి అతిఽథిగా వస్తున్న అరుదైన సీఎం జగన్‌. ప్రధాన సలహాదారులకు తప్ప మంత్రులకు, అధికారులకు, ఎమ్మెల్యేలకు కూడా దర్శనం అరుదే.


  • పేరుకు పదవులిచ్చి తన పక్కన కూడా కూర్చోబెట్టుకోలేని ఫ్యూడల్‌ మనస్తత్వం జగన్‌ది. దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి అండ

  • సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారని 60 ఏళ్ల రంగనాయకమ్మపై కేసులు పెట్టి వేధించిన ఘనత జగన్‌ది. బాబాయి హత్యపై సొంత చెల్లెలు నిలదీసినందుకు జుగుప్సాకరంగా మాటల దాడి

  • శంషాబాద్‌ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరును కొనసాగించడానికి వైఎస్‌ నిరాకరించారు. విజయవాడలో ఎన్టీఆర్‌ స్థాపించిన వైద్య విద్యాలయానికి జగన్‌ ఆయన పేరును తొలగించి తన తండ్రి పేరు పెట్టారు

  • ఈ-సేవను మీ-సేవగా మార్చడం తప్ప జగన్‌ తలపెట్టిన

  • గొప్ప మార్పు ఒక్కటీ లేదు

  • ఉన్న పాఠశాలలకు రంగులేసి సొంత ప్రచారం, నాడు-నేడులో అవినీతి, చేసిన ఖర్చుకు, మార్పుకు పొంతన లేదు

  • ఉపాధి నిధులు దారిమళ్లించడంతో పాటు పథకాల అమల్లో

  • తప్పిదాల వల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల్లో

  • రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారేలా చేశారు.

  • జగన్‌ సబ్సిడీ రుణాల పథకాలన్నింటినీ

  • గాలికొదిలేశారు. ప్రభుత్వ సాయం తీసుకుని స్వయంశక్తితో స్వావలంబన సాధించాలనే ఆత్మగౌరవ మార్గాన్ని మూసేసి సంక్షేమానికి తప్పుడు భాష్యం చెప్పారు.

  • జగన్‌ రాజకీయ పదవుల్లోకి రాకముందే పరిటాల రవి హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన పాలనలో రౌడీలకు కొమ్ములు వచ్చాయి.

  • పదవులన్నీ ఒకే కులానికి కట్టబెట్టి కూడా ప్రత్యర్థిపైన కులం పేరిట దాడి చేయగల బరితెగింపు జగన్‌ సొంతం.

  • కడుపులో కత్తులు పెట్టుకుని కళ్లలో కారుణ్యం చూపించడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. రాజధానిగా అమరావతే ఉంటుందని, తన ఇల్లు తాడేపల్లిలో కట్టుకున్నానని, తాను వస్తే మరింత మేలు చేస్తానని నమ్మించి మోసం చేశారు.

  • జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత

  • పోలవరానికి గ్రహణం పట్టింది.

  • చంద్రబాబు నిర్మించారన్న అక్కసుతో అవసరమున్నా పట్టిసీమ యంత్రాలకు తాళాలు వేసిన ఘనుడు జగన్‌

  • విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని చెప్పి రాజధాని అమరావతిని అటకెక్కించి, రాష్ట్రంతో మూడుముక్కలాట

  • చంద్రబాబు హయాంలో నిర్మించిన సిమెంట్‌ రోడ్లే ఇప్పటికి మిగిలున్నాయి. కాలక్రమంలో పునరుద్ధరించాల్సిన రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్‌ రోడ్లను పట్టించుకోకపోవడంతో అవన్నీ గుంటలమయ్యాయి.

  • మెగా డీఎస్సీ ఇస్తానంటూ హామీ ఇచ్చి ఎన్నికల ముందు అరకొర పోస్టులతో నోటిఫికేషన్‌, పోలీసు ఉద్యోగాల భర్తీలోనూ మోసమే.

ప్రపంచంతో అనుసంధానం (చంద్రబాబు)

చంద్రబాబు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాలను పెంచారు. ఐటీ, ఫార్మా, ఇతర రంగాల అభివృద్ధికి తగిన విధంగా బేగంపేట విమానాశ్రయం భవిష్యత్తు అవసరాలను తీర్చలేదని గుర్తించి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి బాటలు వేశారు. శంషాబాద్‌ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి ప్రణాళిక రచించిందీ, భారీగా భూసేకరణ చేసిందీ చంద్రబాబు ప్రభుత్వమే. నగరంలో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ, విమానాశ్రయానికి రహదారి నిర్మాణం వంటి కార్యక్రమాలు హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేశాయి.

అంతర్జాతీయంగా అపఖ్యాతి (జగన్‌)

జగన్‌ అవినీతి చరిత్ర అంతర్జాతీయ సరిహద్దులు దాటిపోయింది. ఆఫ్‌షోర్‌ కంపెనీలతో అక్రమ లావాదేవీలకు పాల్పడిన వారి జాబితాలో జగన్‌ పేరు చేరింది. కొన్నేళ్ల కిందట పరిశోధనాత్మక జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం ‘ప్యారడైజ్‌ పేపర్ల’ పేరిట చీకటి లావాదేవీల వివరాలు వెల్లడించింది. ప్యారడైజ్‌ పేపర్లలో పేరు ఉన్న ఏకైక తెలుగు రాజకీయ నాయకుడు జగనే. ప్రపంచానికి ఇలా ఒక ఆర్థిక నేరస్తుడిలా పరిచయమయ్యారు. రాజకీయ పదవుల్లోకి రాకముందే అవినీతి బురదలో పీకల్లోతు కూరుకుపోయిన అరుదైన వ్యక్తి జగన్‌. 20 సీబీఐ-ఈడీ కేసులను ఎదుర్కొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా జగనే.


తొలి ఆఫ్రో ఏషియన్‌ క్రీడలు (చంద్రబాబు)

క్రీడల్లో భారతదేశం వెనుకబాటును అధిగమించడానికి అసాధారణ స్థాయిలో మౌలిక సదుపాయాలను చంద్రబాబు కల్పించారు. 2002 జాతీయ క్రీడలు, 2003 ఆఫ్రో ఏషియన్‌ క్రీడలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో జరిగాయి. ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని అన్ని దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌ తొలిసారిగా హైదరాబాద్‌ నగరంలో జరగడం విశేషం. ఢిల్లీ లేదా కువైట్‌లో జరగాల్సిన ఈ క్రీడలకు చంద్రబాబు చొరవతోనే హైదరాబాద్‌ వేదికైంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తానై అంతర్జాతీయ క్రీడోత్సవాలను నిర్వహించడం అంతకు ముందెన్నడూ జరగలేదు.

జూదాలు, బెట్టింగ్‌లు (జగన్‌)

ముఖ్యమంత్రి జగన్‌కు పగ, ప్రతీకారాలు తప్ప క్రీడలు పట్టవు. క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ పురోగతికి తగిన చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నిర్మించిన స్టేడియాలలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుంటే... వైసీపీ నేతలు బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో ఆరితేరిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి తోడు గుట్కా, మాట్కా, క్యాసినో, కోడిపందేల సంగతి సరేసరి. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని వైసీసీ వేడుకలా మార్చేశారు.

Updated Date - May 10 , 2024 | 09:13 AM

Advertising
Advertising