ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP CM JAGAN:వెంకన్ననూ వాడుకున్నాడు

ABN, Publish Date - May 11 , 2024 | 04:22 AM

మీ వాడకం ఇట్టా ఉంటుందని ఊహించలేదు నాయకా! కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను, ఐఏఎ్‌సలను, ఐపీఎ్‌సలను, సోకాల్డ్‌ తటస్థ మేధావులను... చివరికి తిరుమల వెంకన్న స్వామినీ వదలకుండా వాడుకోవడం మీ ఒక్కరికే సాధ్యం!.... ఇది వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి దక్కిన ఘనత!

స్వప్రయోజనాల కోసం తిరుమలనూ వాడటమే!

టీటీడీ బోర్డు సభ్యుల నియామకాల్లో స్వార్థం

లాబీయింగ్‌, కేసులు, రాజకీయ అవసరాలే ముఖ్యం

ఐదుగురి నియామకాలే దీనికి నిదర్శనం

సీబీఐని మేనేజ్‌ చేసేవారొకరు..

అప్పులు ఇప్పించే వారొకరు

షా సన్నిహితులొకరు.. నిర్మలకు దగ్గరివారొకరు

రాష్ట్రానికి కాదు.. తనకు పనికొచ్చే వాళ్లకే పీఠం

కొండపై ధర్మారెడ్డికి కొలువు.. ఆయనదే రాజ్యం

చావులను రాజకీయానికి వాడుకోవడం! చివరికి.. దేవుడినీ రాజకీయానికి వాడుకోవడం!

ఈ విద్య వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఖాయంగా చెప్పవచ్చు. తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే మనకు భక్తి, ప్రపత్తి! జగన్‌కు మాత్రం ‘తిరుమల’ అనేది లాబీయింగ్‌కు ఒక అవకాశం! అధికారంలో ఉన్న ఐదేళ్లూ... ఆయనది ఇదే వైఖరి! అధికారంలోకి రావడానికి ‘వెంకన్న పింక్‌ డైమండ్‌’ను వాడుకున్నారు. పదవిలోకి వచ్చాక వెంకన్ననే వాడుకున్నారు! దేవ దేవుడు క్షమించాలి!

మీ వాడకం ఇట్టా ఉంటుందని ఊహించలేదు నాయకా! కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను, ఐఏఎ్‌సలను, ఐపీఎ్‌సలను, సోకాల్డ్‌ తటస్థ మేధావులను... చివరికి తిరుమల వెంకన్న స్వామినీ వదలకుండా వాడుకోవడం మీ ఒక్కరికే సాధ్యం!.... ఇది వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి దక్కిన ఘనత! సొంత కేసుల నుంచి రక్షణ, ఢిల్లీలో అవసరాలు, రాజకీయాలు! ఇదే ఆయన లక్ష్యం. మరీ ముఖ్యంగా టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో అర్హతలు, సేవాభావం కంటే... తన సొంత అవసరాలు, లాబీయింగ్‌కు ఉపయోగపడే వారికే జగన్‌ పెద్ద పీట వేశారనే ఆరోపణ ఉంది.

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని క్షణకాలం దర్శించుకోవడమే ఒక మహాభాగ్యంగా అంతా భావిస్తారు. బోర్డు సభ్యుల హోదాలో కావాలనుకున్నప్పుడల్లా దర్శించుకుని, తమ వాళ్లకూ దర్శనం చేయించే అవకాశం లభిస్తే!

ఈ అవకాశం, అదృష్టం కోసం జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖులు ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఈ ‘క్రేజ్‌’నే జగన్‌ ఉపయోగించుకున్నారు. వాళ్లు వచ్చి అడగడం కాదు...‘మీ వాళ్లలో ఎవరైనా ఉంటే చెప్పండి! టీటీడీ బోర్డులో వేద్దాం’ అని వీళ్లే ఆఫర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరిని కలిసి... ఇలాంటి ఆఫరే ఇచ్చారు. ఆయన దీనిని సున్నితంగా తిరస్కరించారు.

  • ఆ ఐదుగురు...

జగన్‌ హయాంలో టీటీడీ బోర్డులో నియమితులైన వారిలో ఐదుగురి గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే! వాళ్ల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప నయాపైసా ఉపయోగం లేదు. కేవలం తన స్వప్రయోజనాల కోసమే జగన్‌ వీరికి టీటీడీ బోర్డు పదవులు ఇచ్చారు.

  • కేంద్ర ఏజెన్సీల కోసం కేతన్‌?

మహారాష్ట్రకు చెందినకేతన్‌ దేశాయ్‌ ఎంసీఐ(మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలో దేశాయ్‌ దారుణమైన అక్రమాలకు పాల్పడ్డాడంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ, కొంతకాలం గడిచాక,


ఆశ్చర్యకరంగా సీబీఐ స్వయంగా దేశాయ్‌కి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. తనపై కేసు పెట్టిన దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థతోనే క్లీన్‌చిట్‌ ఇప్పించుకున్న మహాఘనుడు. ఆయన లాబీయింగ్‌ పవర్‌ అలాంటిది. మరి... జగన్‌ ఇలాంటి వ్యక్తిని వదులుకుంటారా? సీబీఐ కేసుల్లో నిండా మునిగున్న జగన్‌, సీబీఐపై పట్టున్న దేశాయ్‌కి టీటీడీ పాలక సభ్యుడి పోస్టు ఇచ్చి తన లైన్లో ఉంచుకున్నారు.

కేంద్ర ఏజెన్సీలను మేనేజ్‌ చేసి జగన్‌కు అనుకూలంగా వ్యవహరించడమే ఈయన పని. అందులో భాగంగానే తన సోదరుడు అవినాశ్‌ కోసం ఈయన ‘సేవల’ను జగన్‌ వాడుకున్నారు. అలాగే... ఢిల్లీలోనే సెటిల్‌ అయిన నాగసత్యను దాదాపుగా ఈ అవసరాలకోసమే టీటీడీ బోర్డులో నియమించారు. కొందరిని కేతన్‌, కొందరిని నాగసత్య మేనేజ్‌ చేస్తుంటారన్న మాట!

  • షా’ సన్నిహితుడికి...

తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్‌ అనే వ్యక్తి ఒక హైకోర్టు లాయర్‌. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆయన అత్యంత సన్నిహితుడు. 11 సీబీఐ కేసులున్న జగన్‌కు అమిత్‌షాతో ఎంత అవసరం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే అమిత్‌షాతో నేరుగా సంప్రదింపులు జరపగల కృష్ణమూర్తి వైద్యనాథన్‌కు టీటీడీ మెంబర్‌ పదవిచ్చి గుప్పిట్లో ఉంచుకున్నారు.

  • ‘సెటిల్‌మెంట్‌’ రాజేశ్‌...

ముంబైకి చెందిన రాజేశ్‌ శర్మ... క్యాప్రి లోన్స్‌ అనే సంస్థ అధినేత. పేరుకు బంగారంపై రుణాలిచ్చే వ్యాపారమైనప్పటికీ.. ఆర్థిక వివాదాల పంచాయితీలు సెటిల్‌ చేయడంలో దేశంలో రాజేశ్‌ శర్మను మించినవారు లేరు. అది ప్రభుత్వాలకు, ప్రైవేటు సంస్థలకు మధ్య వివాదమైనా... వ్యక్తులకు - వ్యక్తులకు నడుమ వివాదమైనా... ఆర్థిక సంస్థలకు- ఇతర కంపెనీలకు వివాదమైనా... వాటిని సెటిల్‌ చేయడంలో ఈ రాజేశ్‌ శర్మను మించిన వారులేరని కార్పొరేట్‌ రంగంలో పేరుంది.

నిలువెల్లా ఆర్థిక నేరాల్లో మునిగిపోయిన జగన్‌కు.... రాజేశ్‌ శర్మలాంటి వ్యక్తితో అవసరాలు లేకుండా ఎలా ఉంటాయి! అందుకే... ఆయనకు తిరుమలలో పిలిచి పెద్దపీట వేశారు.

బోర్డులో సభ్యత్వం ఇచ్చారు. రాజేశ్‌ శర్మ తిరుమలలో ఒక అతిథి గృహాన్ని కూడా నిర్మించారు. దానిపైన ‘క్యాప్రి లోన్స్‌’ అని రాసుకున్నారు. సాధారణంగా తాడేపల్లి ప్యాలెస్‌ దాటని జగన్‌ నేరుగా వచ్చి గత ఏడాది ఈ అతిథిగృహాన్ని ప్రారంభించారు. ఇదీ రాజేశ్‌ శర్మకు జగన్‌ ఇచ్చిన ప్రాధాన్యం!

  • అప్పుల కోసం ‘శంకర్‌’

తమిళనాడులో బీజేపీకి చెందిన డాక్టర్‌ శంకర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సన్నిహితుడు. ఆయనకు ఒక్కసారి కాదు... రెండుసార్లు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారు. జగన్‌ సర్కారు అడిగిందే తడవుగా అప్పులు మంజూరు చేయడం, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా చూసీ చూడనట్లు వదిలేయడం అందరికీ తెలిసిందే. ఏపీకి ఇచ్చినన్ని సార్లు బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా కేంద్రం అప్పులకు అనుమతివ్వలేదు.

  • బాండ్ల కోసం బోరా!

ముంబైకి చెందిన సౌరబ్‌ బోరా స్టాక్‌మార్కెట్‌ కార్యకలాపాలకు సంబంధించి, ఆ రంగాన్ని ప్రభావితం చేయగల ఒక సలహాదారు. ఆయనకూ జగన్‌ టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చారు.

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా బాండ్లు జారీచేసి మార్కెట్‌ నుంచి రూ.22,500 కోట్ల అప్పు తేవడం, ఇటీవల ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేసి రూ.7,000 కోట్ల అప్పు తేవడంలో తెరవెనుక సౌరభ్‌ బోరానే తతంగం నడిపినట్లు సమాచారం.


  • ధర్మారెడ్డి రాజ్యం!

రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎ్‌సలు ఎంతోమంది ఉండగా, ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీ్‌సకు చెందిన ధర్మారెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి తిరుమలలో సర్వాధికారాలు అప్పగించారు.

ధర్మారెడ్డికి శ్రీవారిపైకంటే, జగన్‌పైనే భక్తి ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు! జగన్‌ చెబుతారు, ధర్మారెడ్డి పాటిస్తారు అనేకంటే... జగన్‌కు ఏమేం కావాలో తెలుసుకుని ధర్మారెడ్డే చేసేస్తారు అనడం కరెక్టు! ఈ ఐదేళ్లూ ఆయన పని ఇదే! మే 14తో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ ముగియనుంది.

కానీ, ఆయనకు జూన్‌ 30 వరకు డిప్యుటేషన్‌ పొడిగిస్తూ రక్షణ శాఖ ఆదేశాలిచ్చింది. ధర్మారెడ్డి లేకపోతే తిరుమల అస్తవ్యస్తమైపోతుందని, జనాలకు శ్రీవారి దర్శనం కష్టమవుతుందంటూ జగన్‌ లేఖ రాయడమే దీనికి కారణం. అటు తిరుమలలో, ఇటు ఢిల్లీలో జగన్‌కు అవసరమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - May 11 , 2024 | 04:22 AM

Advertising
Advertising