ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati Laddu: ఆ నెయ్యి వాడారని ల్యాబ్ కన్ఫామ్

ABN, Publish Date - Sep 19 , 2024 | 07:35 PM

భక్తులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారు. అనుమానం వచ్చి నెయ్యిని ల్యాబ్‌కు పంపించగా గత పాలకుల బండారం బయట పడింది.

Tirupati Laddu

అమరావతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకొని భక్తులు తరిస్తారు. స్వామి వారి దర్శనం తర్వాత ఇష్టంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకుంటారు. తిరుపతి లడ్డూ రుచి అద్భుతంగా ఉంటుంది. ఆ రుచి మరే లడ్డూకు ఉండదు. అందుకే ఎవరైనా తిరుపతి వెళితే తప్పకుండా ప్రసాదం తీసుకొని రావాలని కోరతారు. తిరుపతి లడ్డూకు అంతా ప్రాధాన్యం ఉంది. గత పాలకులు లడ్డూ ప్రసాదం తయారీని గాలికొదిలేశారు. లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారనే కఠోర వాస్తవం తెలిసింది.



నాసిరకం ఉత్పత్తులు

వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు ఇతర పదార్థాలు నాసిరకం ఉపయోగించారు. దాంతో లడ్డూల్లో నాణ్యత లోపించింది. కర్ణాటకకు చెందిన నందిని కో-ఆపరేటివ్ డెయిరీ రాయితీతో నెయ్యి సరఫరా చేసేది. నందిని సంస్థ నెయ్యి సరఫరా చేస్తే కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను గత పాలకులు పక్కనపెట్టారు. కాసులకు కక్కుర్తి పడి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తనకు కావాల్సిన వారి కోసం టెండర్‌ను అప్పగించారు. కేజీ ఆవు నెయ్యి రూ.400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. రూ.320కే సరఫరా చేస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థల గురించి విచారణ చేయకుండా ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థలు నాసిరకం నెయ్యిని రూ.320కే సరఫరా చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారు చేసేందుకు రోజుకు 15 కేజీల నెయ్యి అవసరం అవుతుంది.



నాసిరకం నెయ్యి అని నిర్ధారణ

నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు జూలై 8వ తేదీన ఎన్డీడీబీ కాప్ ల్యాబ్‌కు పంపించారు. ఎన్డీడీబీ కాప్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలించింది. దీనికి ISO 17025 గుర్తింపు పొందింది. డెయిరీ ఉత్పత్తులను పరిశీలించడంలో మంచి అనుభవం ఉంది. ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ కంపెనీలు నెయ్యి, ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి. సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ ఉపయోగించిన నెయ్యిని పరిశీలించి ఆ నెల 16వ తేదీన నివేదిక అందజేశారు.


బీఫ్ టాలో పామాయిల్

టీటీడీ ఉపయగించిన నెయ్యిలో సోయాబిన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె వాడినట్లు స్పష్టమైంది. బీఫ్ టాలో పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇందులో ఎస్ వ్యాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది . 95.68 నుంచి 104.32కు ఉండాల్సిన ఎస్ వ్యాల్యూ 20.32 ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ నిర్ధారించింది. నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్‌కు పంపించగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె అందులో ఉందని నిర్ధారణ అయ్యింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లయ్ చేసిన నేతిని ల్యాబ్‌కు పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని పేర్కొన్నారు. ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.


లడ్డూల నాణ్యత పెంచేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు

1. డా.డి.సురేంద్రనాథ్- ఎన్డీఆర్ఐ, బెంగుళూరు మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, డెయిరీ ఎక్స్

పర్ట్

2. హైదరాబాద్‌కు చెందిన డెయిరీ ఎక్స్ పర్ట్ విజయభాస్కర్ రెడ్డి

3. ఐఐయం బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ బి మాధవన్

4. తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డా.స్వర్ణలత


కమిటీ సిఫారసులు :

-120 సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయాలి.

-సైంటిఫిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి 7 నుంచి 9 పాయింట్ల మధ్య నమోదైతే పరిగణనలోకి తీసుకోవాలి.

-800 కి.మీ. సమీపంలో ఉన్న డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలి

-ఆబ్జెక్టివ్ స్కోరింగ్ మోడల్ ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన కంపెనీలే టెండర్‌కు అర్హత పొందాలి.

-నెయ్యిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడ నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి? ఏ విధంగా సిద్ధం చేస్తున్నాయి ? క్వాలిటీ రిపోర్టులు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి.

-టెండర్లలో ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఎందుకు తక్కువ ధరకు కోట్ చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి...

Tirumala Laddu: తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడకం ఓ మాజీ అధికారి పుణ్యమే: ఓవీ రమణ

YV Subbareddy: టీటీడీ లడ్డుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా...వైవీ ఫైర్

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 19 , 2024 | 08:19 PM

Advertising
Advertising