ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: అయ్యో.. తల్లి.. ‘అమ్మ’కు ఎంత కష్టం వచ్చిందో..

ABN, Publish Date - Dec 19 , 2024 | 12:13 PM

చేతి గాయానికి కట్టు. నడవలేని స్థితి. నోటిమాటా సరిగా రాలేదు. దీనస్థితిలో ఉన్న ఈ 70 ఏళ్ల వృద్ధురాలిని బుధవారం తిరుపతి(Tirupati)లోని రుయా ఆస్పత్రిలో వదిలేశారు. ఈమెను ఉదయం ఓ వ్యక్తి ఆటోలో రుయా అత్యవసర విభాగానికి తీసుకొచ్చాడు.

- ఆస్పత్రికి తీసుకొచ్చి ఓపీ తెస్తానంటూ పరారైన సహాయకుడు

- రుయా ముందు దీనస్థితిలో వృద్ధురాలు

తిరుపతి: చేతి గాయానికి కట్టు. నడవలేని స్థితి. నోటిమాటా సరిగా రాలేదు. దీనస్థితిలో ఉన్న ఈ 70 ఏళ్ల వృద్ధురాలిని బుధవారం తిరుపతి(Tirupati)లోని రుయా ఆస్పత్రిలో వదిలేశారు. ఈమెను ఉదయం ఓ వ్యక్తి ఆటోలో రుయా అత్యవసర విభాగానికి తీసుకొచ్చాడు. అక్కడ వైద్యసిబ్బందికి ఆమె కుమారుడినని చెప్పాడు. ఓపీ తెమ్మంటే.. తెస్తానంటూ వెళ్లిన ఆయన మళ్లీ రాలేదు. అత్యవసర విభాగంలోని వైద్యులు ఆమెను పరీక్షించగా.. చేతికి తీవ్ర గాయాలున్నట్లు గుర్తించారు.

ఈ వార్తను కూడా చదవండి: Ooty Hill Train: ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభం


మందు రాసి కట్టుకట్టారు. ఆమె వెంట వచ్చిన వ్యక్తి కోసం సిబ్బంది విచారించారు. ఎవరూ లేకపోవడంతో మధ్యాహ్నం వరకు అత్యవసర విభాగంలో ఉంచి అనంతరం బయటకు పంపేశారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ తల్లి.. అత్యవసర విభాగం ముందు ఓ చెట్టు కింద నిస్సహాయంగా కూలబడ్డారు. చలికి వణుకుతూ.. చిన్నపాటి చినుకులకు తడుస్తూ తనవారికోసం నిరీక్షిస్తున్నారు.


సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు నిన్ను ఎవరు తీసుకొచ్చారని అడిగితే.. నా కొడుకు అనే సమాధానం తప్ప ఇంకేమీ చెప్పలేదు. చెప్పేందుకూ ఇష్టపడలేదు. పదే పదే అడిగితే నన్ను ఇలాగే వదిలేయండి అంటూ చెమ్మగిల్లిన కన్నీళ్లతో ప్రాధేయపడ్డారామె. ఆమె పరిస్థితికి చలించిన సెక్యూరిటీ సిబ్బంది.. చిన్నపాటి దుప్పటి, నీరు, కొంచెం ఆహారం అందించారు.


ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన

ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు

ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2024 | 12:13 PM