Minister Achhennaidu : రైతుల నుంచి టమాటా కొనుగోళ్లు
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:14 AM
కర్నూలు, పత్తికొండ యార్డుల్లో టమాటా ధరలు పడిపోయినందున మార్కెటింగ్‌శాఖ కిలో రూ.8చొప్పున కొనుగోలు చేసి..
కిలో రూ.8చొప్పున విక్రయించాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): కర్నూలు, పత్తికొండ యార్డుల్లో టమాటా ధరలు పడిపోయినందున మార్కెటింగ్‌శాఖ కిలో రూ.8చొప్పున కొనుగోలు చేసి, అదే ధరకు మార్కెట్లలో విక్రయించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. టమాటా ధర కిలో రూపాయికి పడిపోయిందనే కథనాలపై శుక్రవారం మంత్రి స్పందించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి కావడం, వర్షాధార పంట నాణ్యత లేక, ధర తగ్గడం వల్ల సాధారణ మార్కెట్‌పై ప్రభావం పడిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈనేపథ్యంలో రైతులకు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా, లాభనష్టాలు లేకుండా, కొనుగోలు చేసిన ధరకే విక్రయించాలని మార్కెటింగ్ అధికారులకు మంత్రి సూచించారు.
Updated Date - Dec 14 , 2024 | 05:15 AM