Tirumala : నిండుతున్న తిరుమల జలాశయాలు
ABN, Publish Date - Dec 04 , 2024 | 04:47 AM
ఫెంగల్ తుఫాన్ కారణంగా తిరుమలలోని జలశయాలన్నీ నిండిపోతున్నాయి. వారం నుంచి పలు దఫాలుగా వర్షం కురిసింది. తుఫాన్ కూడా తోడవడంతో గత మూడురోజుల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడ్డాయి.
తిరుమల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ కారణంగా తిరుమలలోని జలశయాలన్నీ నిండిపోతున్నాయి. వారం నుంచి పలు దఫాలుగా వర్షం కురిసింది. తుఫాన్ కూడా తోడవడంతో గత మూడురోజుల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడ్డాయి. అడవుల్లో కురిసిన వర్షం నీరు పిల్ల కాలువల ద్వారా తిరుమలలోని ఐదు జలాశయాల్లో చేరింది. దీంతో గోగర్భం డ్యాం పూర్తిస్థాయిలోనూ, మిగిలిన నాలుగు డ్యాములు దాదాపు 90 శాతం నిండాయి. రెండు నెలల క్రితం తిరుమలలో నీటి కొరత సమస్య ఏర్పడనుందనే భయంతో టీటీడీ అధికారులు నీటి సరఫరా విషయంలో అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తిరుపతి నుంచి నీరు తీసుకురావలసిన అవసరం లేకుండానే వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతమున్న నీటితో 270 రోజులపాటు తిరుమల నీటి అవసరాలు తీరుతాయని అంచనా.
తిరుమలలోని డ్యామ్‌ల సామర్థ్యం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ వివరాలు లక్షల గ్యాలన్లలో..
జలాశయం సామర్థ్యం ప్రస్తుతం
పాపవినాశనం 5,240 5,192
కుమారధార 4,258 3,440
పసుపుధార 1,287 966
గోగర్భం 2,833 2,833
ఆకాశగంగ 685 645
Updated Date - Dec 04 , 2024 | 04:50 AM