ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వ్యాన్-లారీ ఢీ.. బయటపడిన అట్టపెట్టెలు.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..!

ABN, Publish Date - May 11 , 2024 | 09:17 AM

ఏపీలో ఎన్నికల(ap election 2024) సందడి నెలకొంది. మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల సోదాలు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యాన్‌లో బాక్సుల్లో నగదు గుట్టుగా తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది..

Transfer cash van AP west godavari

ఏపీలో ఎన్నికల(ap election 2024) సందడి నెలకొంది. మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఏపీకి గుట్టుగా నగదు తరలిస్తున్న బస్తాల వ్యాన్ బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.


అయితే వ్యాన్‌ను(van) వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన క్రమంలో బోల్తా పడింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళుతున్న వ్యాన్ బోల్తాపడిన క్రమంలో వ్యాన్ అడుగుభాగంలో నాలుగు బాక్సులను అధికారులు గుర్తించారు. వాటిలో నగదును తరలిస్తున్నట్టుగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. వాటిని ఉన్నతాధికారుల సమక్షంలో ఓపెన్ చేస్తామని పోలీసులు(police) వెల్లడించారు. అయితే ఎన్నికల సమయంలో గుట్టుగా తెలియకుండా అడుగున బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులు ఆరా తీస్తున్నారు.


దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు(loksabha election 2024) జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన తర్వాత దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతా బలగాలు ఎక్కడికక్కడ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల డబ్బు, మద్యం పట్టుబడుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్భంగా అక్రమ నగదు, మద్యం రవాణా సహా ఇతర వసూళ్లపై నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

Hero Shivaji :ఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశంఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం


Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ ఈ వింత లీలలు!


Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 12:50 PM

Advertising
Advertising