ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tree Lament : తరు విలాపం

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:20 PM

‘ఎందరికో నీడ, ఫలాలు, కొయ్య, ఇంటికి అవసరమయ్యే పరికరాలను అందిస్తూ ఎంతో పచ్చగా ఉండే నన్ను నరకడం మానవ వినాశనానికి హేతువు. విశ్వానికి వెలుగు దివ్వెగా నిలిచి ప్రాణవాయువును అందిస్తూ మానవాళిని రక్షించే ఏకైక సాధనాన్ని. నా ఆగమనం. చల్లని మేఘాలకు తీపికబురు నా శ్వాస.... సుతిమెత్తని నాస్పర్శ తోనే వరుణుడు పరవశమవుతాడు.

లారీల్లో తరలివెళుతున్న వృక్షసంపద (ఫైల్‌ఫొటో)

చెట్లు నరకడం వినాశనమే

తరగిపోతున్న వృక్షసంపద

నాటుడు కంటే నరుకుడే ఎక్కువ

అధికారులకు పట్టని వాల్టా

బద్వేలుటౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘ఎందరికో నీడ, ఫలాలు, కొయ్య, ఇంటికి అవసరమయ్యే పరికరాలను అందిస్తూ ఎంతో పచ్చగా ఉండే నన్ను నరకడం మానవ వినాశనానికి హేతువు. విశ్వానికి వెలుగు దివ్వెగా నిలిచి ప్రాణవాయువును అందిస్తూ మానవాళిని రక్షించే ఏకైక సాధనాన్ని. నా ఆగమనం. చల్లని మేఘాలకు తీపికబురు నా శ్వాస.... సుతిమెత్తని నాస్పర్శ తోనే వరుణుడు పరవశమవుతాడు. నా తనువుచాటున భూమా త చల్లగా పవళిస్తుంది. సకల జనుల సుభిక్షానికి నా మనుగడే ప్రధానం. అలాంటి నాకే నిలువనీడలేకుండా చేశారు. మారణాయుధాలతో నన్ను ఖండఖండాలుగా నరికేస్తున్నారు. నేలేని ప్ర పంచమే శూన్యం.. అంటూ ఓ తరువు తరుముకొస్తున్న ప్రళయాన్ని చెబుతూ రక్తకన్నీటిని నేలరాలుస్తోంది.

ప్రకృతి ప్రకోపానికి మానవాళి అంతమయ్యే ఘడియలు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చుక్కనీరులేక, నిలువనీడలేక నిప్పులకుంపటి నడుమ మండిపోతున్నా మనిషి మారడంలేదు. ధనాపేక్షే ధ్యేయంగా స్వార్థానికి పచ్చనిచెట్లను కొందరు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. కరువు నిలయమైన ప్రాంతాల్లో అధికంగా మొక్కలు పెంచాల్సింది పోయి ఉన్నవాటినే నేలకూల్చుతున్నారు.


వాతావరణ సమతుల్యతను కాపాడే క్రమంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ప్రజలు అధికారుల్లో చిత ్తశుద్ది ఉంటే ప్రభుత్వం ఆశించిన ఆశయం సఫలమవుతుంది. కళ్లముందే భయాందోళన లు కన్పిస్తున్నా ఎవరికి వారు మిన్నకుం టున్నారు. నీరు, చెట్టు, నేల పరిరక్షణ కోసం 2002లో ప్రవేశపెటి ్టన వాల్టాచట్టాన్ని కొందరు స్వార్థపరులు ఉల్టాపల్టా చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదిత వనసంపద కనుమరుగైపోతోంది. స్వార్థంతో పచ్చనిచెట్లను నరికేస్తుండడంతో సకాలంలో వర్షాలు కురవక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లగా సాధార ణం కంటే తక్కువ శాతం వర్షా లు కురవడంతో రైతులు కరువు తో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో వర్షాలు కుర వకపోవ డానికి కారణం అడవుల పట్ల నిర్లక్ష్యం వహించడం, కాపాడుకో లేక పోవడమేనని తెలిసినా ఇష్టానుసారంగా అటవీ ప్రాంతా ల్లో, రహదారుల పక్కన, పట్టా భూముల్లో యథేచ్ఛగా పచ్చని చెట్లను నరికేస్తున్నారు. పట్టా ఉన్నా, అనుమతులు తీసుకో వాలన్న నిబంధనలు ఉన్నా, ఇవేమీ పట్టించుకోకుండా చెట్లను నరికి విక్రయిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతోనే పచ్చనిచెట్ల నేలకొరుగుతున్నాయి.


బద్వేలు హైవేపై చెట్లను నరికేస్తున్న దృశ్యం (ఫైల్‌ఫొటో)

చాలా ప్రాంతాల్లో మొక్కలను నాటి తరువాత వదిలేయడంతో రక్షణ కరువై నిట్టని లువునా మొక్కలు ఎండిపోతున్నాయి. ఇన్ని లక్షల మొక్కలు నాటామని అఽధికారులు లెక్కలు చెప్పడమే తప్ప, నాటిన మొక్క లను ఎన్నింటిని సంరరక్షించారన్న మాటలకు అధికారుల్లో సమాధానం లేదు. ఇప్పటికైనా అధికారులు మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటే మంచిది.

నాటుడు కంటే నరుకుడే ఎక్కువ

ఏడాదికి ఏడాది అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల నుంచి కలప అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయడంలో ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడంతో ఆయా ప్రాంతాల నుంచి వంట చెరుకు, ఇటుకల బట్టీలకు, బొగ్గుల తయారీకి, నివాసగృహా ల కలపకు ట్రాక్టర్ల, లారీల నుంచి వృక్షసంపద తరలిపో తోంది. ఇప్పటికైనా ఫారెస్ట్‌ అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Nov 09 , 2024 | 11:20 PM