Share News

TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ వెబ్ సైట్ లో కీలక మార్పులు..

ABN , Publish Date - Jan 11 , 2024 | 09:33 AM

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే

TTD: భక్తులకు అలర్ట్.. టీటీడీ వెబ్ సైట్ లో కీలక మార్పులు..

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్‌సైట్ పేరును మరోసారి మార్చింది. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉండగా ప్రస్తుతం ttdevasthanams.ap.gov.in గా మార్పు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పును భక్తులు గుర్తించాలని, దానికి అనుగుణంగా టీటీడీకి సహకరించాలని కోరింది. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పేరు మార్పుని వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌ సైట్, వన్ మొబైల్ యాప్‌లో భాగంగా మార్చినట్లు అధికారులు తెలిపారు.

గతంలో TTD వెబ్‌సైట్ పేరు టీటీడీ సేవా ఆన్‌లైన్ అనే పేరుతో ఉంది. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను tirupatibalaji.ap.gov.in గా మార్చారు. ఇప్పుడు ఆ పేరునూ ఛేంజ్ చేసి ttdevasthanams.ap.gov.in గా మార్చారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస వంటి వివరాలను పొందుపరిచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది.

మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 09:33 AM