Minister Pemmasani : గ్రాండ్ క్యాన్యన్‌లా గండికోట
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:12 AM
అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి
గండికోట అభివృద్ధికి కేంద్రం నుంచి రూ. 77.91 కోట్లు
న్యూఢిల్లీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. గురువారం ఇక్కడ సమాచార భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లను మంజూరు చేసినందుకు కేంద్రప్రభుత్వానికి, కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరించడానికి, పర్యాటకంగా అభివృద్థి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేసింది. కోట అభివృద్థితో పాటు స్థానిక నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆ నిధులను వినియోగించనున్నారు. కాగా, గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు తెలియజేసేలా అభివృద్థి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈనెల 4న లేఖ రాశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నిధుల మంజూరుకు కృషి చేశారు.
Updated Date - Nov 29 , 2024 | 03:12 AM