ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nellore: భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు.. ఎవరిదో జోరు!

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:46 PM

చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా నెల్లూరు ఎంపీ స్థానానికి భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు నడుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వీపీఆర్‌), వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి (వీఎస్‌ఆర్‌)ల మధ్య ప్రతిష్టాత్మక పోటీ సాగుతోంది.

  • నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి వర్సెస్‌ వేణుంబాక !

  • జిల్లావ్యాప్తంగా సేవలతో వీపీఆర్‌

  • సొంత ఊరికే చుక్కలు చూపించిన వీఎస్‌ఆర్‌

  • జలదాతగా ప్రభాకరుడు

  • అవినీతి మరకలతో విజయసాయి

నెల్లూరు: చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా నెల్లూరు ఎంపీ స్థానానికి భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు నడుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వీపీఆర్‌), వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి (వీఎస్‌ఆర్‌)ల మధ్య ప్రతిష్టాత్మక పోటీ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు వీరిద్దరూ ఒకే పార్టీ నేతలు. ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులే. అంతేకాదు ఒకే జిల్లా వాసులు. అయితే వీరి వ్యక్తిత్వాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవిగా ప్రజలు భావిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని వందలాది గ్రామాలు వీపీఆర్‌ను జలదాతగా గుర్తుంచుకుంటే.. విజయసాయి మాత్రం సొంత ఊరికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.


ఏదోరకంగా తమను ఆదుకుంటారని నమ్మకంతో ప్రజలు వీపీఆర్‌ ఇంటికి క్యూ కడుతుంటే.. విజయసాయి రాజకీయ కక్షదారుడని విశాఖవాసులు ఘోషిస్తున్నారు. గో బ్యాక్‌ అంటూ నినదిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించే విద్యాదాతగా వీపీఆర్‌ను జిల్లా ప్రజలు గుర్తుంచుకుంటే.. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చిన నింద విజయసాయిని వెంటాడుతోంది. ఇలా.. వీరిద్దరి మధ్య వెలుగుకు, చీకటికి ఉన్నంత తేడా కనిపిస్తోందనేది జనవాక్యం. ఈ రసవత్తర పోరులో ప్రజలు ఎటువైపు నిలుస్తారు... ఎవరిని ఆదరిస్తారు? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.


వీపీఆర్‌కు దాతగా గుర్తింపు :

వీపీఆర్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు నుంచే దాతగా జిల్లా ప్రజల్లో గుర్తింపు పొందారు. వీపీఆర్‌ ట్రస్ట్‌ స్థాపించి వ్యాపార రంగా నికి సమాంతరంగా జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాల ప్రజల దృష్టిలో జలదాతగా గుర్తింపు పొందారు. సొంత నిధులతో వందకు పైగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఎనిమిదేళ్ల క్రితమే పాఠశాల స్థాపించారు. అక్కడుండేవారికి పుస్తకాలు, భోజన వసతిని ఉచితంగానే అందజేస్తు న్నారు. జిల్లాతోపాటు దేశ వ్యాప్తంగా ఎన్నో అనాథ శరణాలయాలకు విరాళాలు అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల పునరుద్ధరణకు భారీ మొత్తాలను అందించారు.


వీటన్నింటికి మించి సాయం కోరిన వారిని ఒట్టి చేతులతో పంపని మంచి వ్యక్తిగా ప్రజల దృష్టిలో నిలిచారు. ఈ కార్యక్రమాలే ఆయనకు రాజకీయ పదవులు తెచ్చిపెట్టాయి. అయితే కుట్ర రాజకీయాలను జీర్ణించుకోలేక వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో పక్షం రోజుల పాటు ఆయన నివాసానికి జనం పోటెత్తివచ్చి సంఘీభావం తెలిపారు. ఆరేళ్లపాటు వైసీపీలో క్రియాశీల నాయకు డిగా వ్యవహరించినా, చిన్న అవినీతి మరక కూడా లేకుండా బయటకు వచ్చారు.

ఆయన పార్టీలో చేరిక సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా నెల్లూరుకు వచ్చి వీపీఆర్‌ దంపతులకు స్వాగతం పలికారు. ఆ దంపుతలు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసే క్రమంలో ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా మౌనంగానే ఉండిపోయారు. తన గురించి నీతి లేని వ్యాఖ్యలు చేసే వారి సంగతి ఆ దేవుడే చూసుకుంటా డని ఓర్పు వహించారు. రాజకీయాల్లో వివాద రహితుడిగా, అజాత శత్రువుగా గుర్తింపు పొందారు.


విశాఖను వణికించిన వీఎస్‌ఆర్‌:

నెల్లూరు ముద్దుబిడ్డగా ప్రచారం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి జిల్లాకు చేసిన సేవ ఏదైనా ఉందా ? అంటే ఏమి లేదనే చెప్పాలి. చివరకు సొంత ఊరికి కూడా పెద్దగా ఏమి చేయలేదు. సుమారు 12ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీలో నంబర్‌ 2గా గుర్తింపు పొందిన వీఎస్‌ఆర్‌ తన మార్కు కనిపించేలా జిల్లాకు ఒక్క పని కూడా చేయలేదు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండ లం, తాళ్లపాక ఆయన సొంతూరు. రెండున్నరేళ్ల క్రితం ఆ గ్రామా న్ని ఆయన దత్తత తీసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌, కల్యాణ మండం కట్టిస్తానన్నారు. రూ.14 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అవేవి చేయలేదు. ప్రభుత్వ నిధులతో నాలుగు రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు వేశారు తప్ప ఆయన సొంత నిధులు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇకపోతే ప్రభుత్వ నిధులతోనైనాసరే ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చలేకపోయారు.


విశాఖను వణికించిన వీఎస్‌ఆర్‌:

నెల్లూరు ముద్దుబిడ్డగా ప్రచారం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి జిల్లాకు చేసిన సేవ ఏదైనా ఉందా ? అంటే ఏమి లేదనే చెప్పాలి. చివరకు సొంత ఊరికి కూడా పెద్దగా ఏమి చేయలేదు. సుమారు 12ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీలో నంబర్‌ 2గా గుర్తింపు పొందిన వీఎస్‌ఆర్‌ తన మార్కు కనిపించేలా జిల్లాకు ఒక్క పని కూడా చేయలేదు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండ లం, తాళ్లపాక ఆయన సొంతూరు. రెండున్నరేళ్ల క్రితం ఆ గ్రామా న్ని ఆయన దత్తత తీసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌, కల్యాణ మండం కట్టిస్తానన్నారు. రూ.14 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అవేవి చేయలేదు. ప్రభుత్వ నిధులతో నాలుగు రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు వేశారు తప్ప ఆయన సొంత నిధులు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇకపోతే ప్రభుత్వ నిధులతోనైనాసరే ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చలేకపోయారు.


జాతీయస్థాయిలో గుర్తింపు..

ఇక పేరు ప్రఖ్యాతుల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ప్రచారంలోకి వచ్చారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ-2 నిందితుడిగా ఈడీ కోర్టుల చుట్టూ తిరుగుతు న్నారు. విశాఖపట్నం విషయం లో మరోసారి జాతీయస్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. విశాఖ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయ కుల ఆర్థిక మూలాలను దెబ్బ తీయడమే ఽధ్యేయంగా కుట్రలు పన్నారనే అభియో గాలు ఎదుర్కొన్నారు. రాజ కీయ కక్షలతో గీతం వర్సిటీ ప్రహరీ పడగొట్టారని, విశాఖ మాజీ ఎంపీ, మాజీ మేయర్‌ ఇంట్లో ప్రభుత్వ స్థలం కలిసి ఉందని ఆ ఇల్లు పడగొట్టించా రని, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మా ణం ఆపిం చారని పెద్ద ఎత్తున ఆరోపణ లు వెల్లువెత్తాయి. 50 ఏళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూ.వేల కోట్ల విలువ జేసే దసపల్ల భూములను నిషేదిత జాబితా నుంచి తొల గించి తమ వారి పేర్లు మీద రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.


ప్రభుత్వ భూముల్లో విజయసాయి బినామీలు అపార్టుమెంట్లు కడుతు న్నారని, ఆ అపార్టుమెంట్లకు వెళ్లే వంద అడుగుల రోడ్డు కూడా ప్రభుత్వ సొమ్ము తో వేస్తున్నారని విశాఖ నగరం ఘోషించింది. కేంద్రం నిధులతో నిర్మిస్తున్న విశాఖ బీచ్‌- బోగాపురం బీచ్‌ వరకు కోస్టల్‌ కారిడార్‌ పథకం కింద నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డును విజయసాయి పథకం ప్రకారం భీమిలి వైపు మళ్లించాడని, అంతకుముందే అక్కడున్న భూములను కారుచౌకగా కొనుగోలు చేసి, రోడ్డు వచ్చిన తరువాత అధిక ధరకు అమ్ముకున్నాడని విశాఖ కోడై కూసింది. అంతేకాక ఆంధ్ర యూనివర్సిటీని సైతం విజయసాయి రాజకీయ కేంద్రంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఆంధ్రవర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డికి అప్పగించారని, దీంతో టికెట్‌ కోసం వచ్చే రాజకీయ నాయకులతో ఆంధ్రవర్సిటీ రాజకీయ కేంద్రంగా మారిపోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఐదేళ్లుగా విజయసాయికి వ్యతిరేకంగా విశాఖలో తరచూ ఉద్యమాలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 22 , 2024 | 02:47 PM

Advertising
Advertising