ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : కావలి @39 డిగ్రీలు

ABN, Publish Date - Aug 20 , 2024 | 04:02 AM

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ, ఉక్కపోత పెరిగాయి.

  • రాష్ట్రంలో సూర్యుడి భగభగలు

  • నేడు, రేపు వర్షాలు పడే చాన్స్‌

  • మండిన ఎండ.. కావలిలో 39 డిగ్రీల ఉష్ణాగ్రత

విశాఖపట్నం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ, ఉక్కపోత పెరిగాయి. సోమవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

దేశంలోనే అత్యధికంగా కావలిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాయలసీమ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ తీరం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

ఒకపక్క ఎండలు, ఉక్కపోత, మరోవైపు ఆవర్తనం ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల సాయంత్రం వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం విపత్తుల నిర్వహణ సంస్థ ఉందని పేర్కొంది.

Updated Date - Aug 20 , 2024 | 04:02 AM

Advertising
Advertising
<