ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vizag Steel Plant : ‘ఉక్కు’ కోసం త్యాగాలు చేయండి

ABN, Publish Date - Jul 09 , 2024 | 05:18 AM

‘సంస్థను నిలబెట్టుకోవాలంటే మీరు త్యాగాలు చేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తలోక చేయీ వేయకపోతే మనుగడ కష్టం. ఎవరి స్థాయిలో వారు...

జీతాలు, అలవెన్సులూ వదులుకోండి

స్వచ్ఛందమే... బలవంతమేం లేదు

ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం ప్రతిపాదన

పీఎ్‌సయూ ఇలాంటి ప్రతిపాదన

చేయడం ఇదే ప్రథమం

ఆరేళ్లుగా అమలుకాని వేతన ఒప్పందం

సక్రమంగా కార్మికులకు అందని జీతాలు

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

‘సంస్థను నిలబెట్టుకోవాలంటే మీరు త్యాగాలు చేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తలోక చేయీ వేయకపోతే మనుగడ కష్టం. ఎవరి స్థాయిలో వారు... జీతాలు, అలవెన్సులూ వదలుకోవాలి. అంతా స్వచ్ఛందమే. బలవంతమేమీ లేదు. ఇష్టమైతే ఫార్మేట్‌లో వివరాలు పూర్తి చేయండి’ అంటూ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)... రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ యాజమాన్యం తన కార్మికులకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. ‘ఉక్కు’ను నిలబెట్టడానికి కార్మికులు, మేధావులు అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని ఈషణ్మాత్రం పట్టించుకోకుండా యాజమాన్యం సంస్థ పరిరక్షణకేనంటూ కార్మికులు, ఉద్యోగుల పొట్టకొట్టడానికి చూడడం సరైంది కాదని కార్మికలోకం స్పష్టం చేస్తోంది.

ఇప్పటికే కటింగుల పేరుతో అలవెన్సుల్లో కోత పెడుతున్నారని, జీతాలు ఏనాడూ సకాలంలో అందడం లేదని, అనేక మంది అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 9 వస్తున్నా... జూన్‌ నెల జీతం ఇంకా అందలేదని వారు గుర్తు చేస్తున్నారు. మానవ వనరుల విభాగం(హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌) ద్వారా ఈ వింత ప్రతిపాదనను యాజమాన్యం విడుదల చేసింది. కొంతకాలం పాటు ఉద్యోగులు ఇలాంటి త్యాగాలు చేయకపోతే సంస్థను నిలబెట్టుకోవడం కష్టమని ప్రకటించింది. విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇలాంటి ప్రతిపాదన చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ‘ఎగ్జిక్యూటివ్‌ అధికారులు వారికి వచ్చే అలవెన్సులు ఏమేమి వెనక్కి ఇచ్చేస్తారో తెలిపాలి. నాన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అయితే ఎనర్జీ అలవెన్స్‌ ఎంత వదిలేస్తారో చెప్పాలి. అలాగే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు క్యాంటీన్‌ రాయితీ వదులుకోవాలి. నైట్‌ షిఫ్ట్‌ అలవెన్స్‌, ఎల్‌టీఈ (ట్రావెలింగ్‌ అలవెన్స్‌), ఇంకా ప్రత్యేక అలవెన్సులు ఏమైనా ఉంటే వాటినీ వదులుకోవాలి’ అని సూచించింది.


ఇస్తోందే అంతంత మాత్రం...

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం గత ఆరేళ్లుగా వేతన ఒప్పందం అమలు చేయడం లేదు. పాత వేతనాలనే ఇస్తోంది. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేసే సగటు ఉద్యోగికి రోజుకు బేసిక్‌+డీఏ కలిపి రూ.1,400 వస్తోంది. ఇవి కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు అప్పులు చేయవలసి వస్తోంది. ఎనర్జీ అలవెన్స్‌ కింది రోజుకు రూ.10 మాత్రమే ఇస్తారు. ఇప్పుడు దానిని కూడా వదులుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్యాంటీన్‌ అలవెన్స్‌ కింద రోజుకు రూ.32 ఇస్తారు. ఇప్పుడు ఆ మొత్తం త్యాగం చేయాల్సిందిగా కోరుతున్నారు. రాత్రి పూట పనిచేస్తే ఆ రోజుకు రూ.90 ఇస్తారు. అత్యంత తక్కువ నైట్‌ అలవెన్స్‌ ఇదే. దీనినీ తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎల్‌టీఈగా పెట్రోల్‌కి రోజుకు రూ.33 ఇస్తున్నారు. టౌన్‌షి్‌పలోని క్వార్టర్‌లో ఉంటూ ప్లాంటుకు రాకపోకలు సాగిస్తేనే రోజుకు పెట్రోల్‌కి రూ.80 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే యాజామన్యమే తిరిగి ఉద్యోగులకు అదనపు మొత్తం ఇవ్వాలి. కానీ దానిని కూడా వదులుకోమంటోంది. స్పెషల్‌ అలవెన్స్‌ అంటూ కొందరికి రోజుకు రూ.40 ఇస్తున్నారు. కాలానుగుణంగా పెంచాల్సిన వాటిని పెంచకపోగా 2012లో ప్రకటించి, ఇప్పటికీ కొనసాగిస్తున్న ఆ మొత్తాన్నీ వదులుకోవాలని కోరుతోందంటూ ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు.

ఎంత వదులుకున్నా...

త్యాగాల పేరుతో తాము ఎంత వదులుకున్నా... ‘సంద్రమంత అవసరంలో, అది ఓ ఇసుక రేణువంతే’ అని వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటులో 16 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇప్పటికే జీతాల్లో సీపీఎఫ్‌, ఎస్‌బీఎఫ్‌ అం టూ కొంత కోత విధిస్తున్నారు. ఇప్పుడు మరికొంత యాజమాన్యానికి ఇస్తే కుటుంబాలతో బతికేదెట్లా? అని ప్రశ్నిస్తున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వని యాజమాన్యానికి ఇలాంటి ప్రతిపాదన చేసే అర్హత ఎక్కడదని నిలదీస్తున్నారు. తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అం తా కలసి సగటున నెలకు రూ.1,000 చొప్పున వదులుకుంటే... నెలకు రూ.1.6 కోట్లు యాజమాన్యానికి మిగులుతాయి. ఈ మొత్తంతో ప్లాంటును ఆర్థిక కష్టాల నుంచి ఎలా గటెక్కిస్తారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్లాంటును నెలబెట్టడానికి అనుసరించాల్సిన, చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారించకుండా గంభీరంగా త్యాగాల పేరుతో విజ్ఞప్తులు చేయడం సమస్యకు మసిపూసి మారేడుకాయ చేయడమేనని అంటున్నాయి. యాజమాన్యం కుయుక్తులను కట్టిపెట్టి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 06:58 AM

Advertising
Advertising
<