ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:13 AM

బంగ్లాదేశ్‌ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది.

  • వాయుగుండంగా మారే అవకాశం

విశాఖపట్నం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 15వ తేదీకల్లా బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గురువారం రాష్ట్రంలో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Sep 13 , 2024 | 07:01 AM

Advertising
Advertising