PawanKalyan: అప్పుడే వచ్చి ఉంటే.. నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు
ABN, Publish Date - Oct 06 , 2024 | 10:01 PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాల్లో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు.
అమరావతి, సెప్టెంబర్ 06: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాల్లో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకు వెళ్తానని వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Also Read: Etela Rrajender: సీఎం రేవంత్‌కి ఎంపీ ఈటల ఘాటు లేఖ
Also Read: KCR: కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ కోసం..
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలు మరచిపోవద్దన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితులు ప్రతిపాదనలు.. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తానని ఈ సందర్భంగా వారికి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
Also Read: Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు.. 32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాల ఫలితమని ఆయన గుర్తు చేశారు. అలా 24 వేల ఎకరాలు భూ సేకరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు బతకాలని తాను కోరుకుంటానని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. అలాగే సహకార విధానంలో ఉన్నవి సైతం నిలబడాలని తాను ఆకాంక్షిస్తానన్నారు.
Also Read: Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!
విశాఖ స్టీల్ ప్లాంట్.. ప్రయివేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాని కలిసి పలువురు త్యాగాలు, పోరాటాలతో ఈ పరిశ్రమ ఏర్పాటైందని తాను వివరించానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద గతంలో సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం వద్దకు వెళ్ళి.. విజ్ఞాపన ఇద్దామని చెబితే ఎవరూ ముందుకు రాలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండేది కాదన్నారు.
Also Read: Dasara 2024: ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ
ప్రస్తుతం మీ ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తానని స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇక స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం 12,500 మంది ఉద్యోగులతోపాటు 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఈ సందర్భంగా పవన్ దృష్టికి వారు తీసుకు వెళ్లారు. అలాగే ఈ సంస్థ ప్రైవేటీకరణ సైతం ఆపాలని డిప్యూటీ సీఎం పవన్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విధంగా స్పందించారు.
For AndhraPradesh News And Telugu News...
Updated Date - Oct 06 , 2024 | 10:01 PM