ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Avanti Srinivas: వైసీపీకి రాజీనామాపై అవంతి క్లారిటీ

ABN, Publish Date - Dec 12 , 2024 | 11:23 AM

Andhrapradesh: వైసీపీ రాజీనామాకు గల కారణాలపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని... వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

Former Minister Avanthi Srinivas

విశాఖపట్నం, డిసెంబర్ 12: వైఎస్సార్సీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Former Minister Avanthi Srinivas)పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి (YSRCP), పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి గురువారం అవంతి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని... వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చానని.. సేవ చేశాననని.. సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదని తెలిపారు.

మోహన్‌ బాబుకు మరో షాక్..


భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేశానని.. ప్రతి ఇంటిని టచ్ చేశానన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశానని చెప్పుకొచ్చారు. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ‘‘నా హయాంలో నేనెలాంటి అవినీతి చెయ్యలేదు.. అవినీతిని ప్రోత్సహించలేదు. ఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి.. ఆరు నెలల నుంచి ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. అంతా వాలంటీర్‌లే నడిపించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరిని ఒకేసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసం’’ అని ప్రశ్నించారు.


బ్రిటిష్ వారు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయమనడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందిందని... మన రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు.. సీఎంలు కావచ్చు ఎన్నికల ముందు ఒక ఆకాంక్షతో వచ్చి.. ఆ సీట్లోకి వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇబ్బందులు వస్తాయని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Google: ఏపీకి గూగుల్‌

YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 12:09 PM