ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PV Sindhu: తోటగరువులో పీవీ సింధు భూమి పూజ

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:56 AM

Andhrapradesh: భూమి పూజ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. అకడామీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించదని తెలిపారు. ఈ అకాడమీతో భవిష్యత్‌లో ఎంతో మంది క్రీడాకారాలు తయారవుతారని తెలిపారు. చాలా అకాడమీలు ఉన్నప్పటికీ విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి...

Badminton player PV Sindhu

విశాఖపట్నం, నవంబర్ 7: విశాఖ తోటగరువులో బాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (Badminton player PV Sindhu) భూమి పూజచేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి కుటుంబసభ్యులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ స్థలంపై ఎలాంటి వివాదం లేదని పీవీ సింధు తెలిపారు. స్థానికులు అడుగుతున్నట్లు కళాశాలకు వేరే చోట కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపామని పీవీ సింధు చెప్పారు.

AP Police: సినీ ఫక్కీలో కార్‌ చేజింగ్.. ఏం జరిగిందంటే



భూమి సందర్భంగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో పీవీ సింధు మాట్లాడుతూ.. భూమి పూజ చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అకడామీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించదని తెలిపారు. ఈ అకాడమీతో భవిష్యత్‌లో ఎంతో మంది క్రీడాకారాలు తయారవుతారని తెలిపారు. చాలా అకాడమీలు ఉన్నప్పటికీ విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి వచ్చి కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే అకాడమీ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. భూమి విషయంలో ఎలాంటి వివాదం లేదన్నారు. ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. తనకు ప్రభుత్వం భూమి ఇచ్చిన విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు. మాకు మరో ఎకరం కావాలని ప్రభుత్వాన్ని అడిగిన వెంటనే ఇవ్వలేదని.. అన్ని విధాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే భూమిని కేటాయించినట్లు తెలిపారు. నిబంధనలు అన్నింటినీ పాటించామని అన్నారు. స్థానికులు అడుగుతున్న కాలేజీ కోసం ప్రభుత్వం ప్రత్నామ్నాయం చూస్తామని చెప్పిందని, మూడు ఎకరాలను కూడా అన్ని అనుమతుల ద్వారానే తీసుకున్నామని అన్నారు. ఏడాదిలోపు అకాడమీని ఏర్పాటు చేసి భవిష్యత్‌లో మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. మంచిరోజు కాబట్టి ఈరోజు భూమి పూజ చేసినట్లు పీవీ సింధు పేర్కొన్నారు.


2021లో స్థలం కేటాయింపు..

కాగా.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌కు గత ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా తోటగురువులో స్థలాన్ని అకాడమీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021, జూన్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం పీవీ సింధుకు విశాఖలో రెండు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్ప్రోట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు గాను పీవీ సింధుకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖ రూరల్ మండలం చినగదిలి మండలంలో 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయించింది. అకాడమీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడమే కాకుండా నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీకి బదలాయించింది.


స్థానికుల ఆందోళన

అయితే ఆ స్థలంపై ఇటీవల స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో జూనియర్ కాలేజ్ నిర్మించాలంటూ వారు నిరసనకు దిగారు. జూనియర్ కాలేజ్ కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు స్థానికులు కోరారు. ఖచ్చితంగా ఆ స్థలాన్ని జూనియర్ కాలేజ్‌కు కేటాయించాలని స్థానికులు పట్టుబడుతున్నారు.


ఇవి కూడా చదవండి...

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 10:56 AM