Alluri District: నిండు గర్భిణిని.. ఐదు కిలోమీటర్ల డోలీ మోత..
ABN, Publish Date - Oct 20 , 2024 | 09:38 AM
గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె భర్త బడ్నాయిని సన్యాసిరావు, అతని అన్నయ్య బడ్నాయిని బొజ్జన్న ఇద్దరు ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు ఆమెను డోలీలో మోసుకొని వచ్చారు.
అనంతగిరిలో డోలీ మోత కష్టాలు..
నిండు గర్భిణిని ఐదు కిలోమీటర్లు డోలీ మోత..
రోడ్డు సౌకర్యం లేక తప్పని డోలీమోత కష్టాలు..
అల్లూరి జిల్లా : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Sitaramaraju District) గర్భిణీల డోలీమోతల (Doli motha) ఆగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు ఎవరైనా సరే గిరిజనుల (Tribals) కష్టాలు మాత్రం తీరడం లేదు. గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం రోడ్డు సౌకర్యం లేక వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిండు గర్భిణిని గిరిజనులు ఐదు కిలోమీటర్లు డోలీలో మోసుకువెళ్లారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తప్పని సరి పరిస్థితిలో గర్భిణిని డోలీలో మోసుకువెళ్లారు. అరకులోయ, అనంతగిరి మండలం, గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెలితే.. గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె భర్త బడ్నాయిని సన్యాసిరావు, అతని అన్నయ్య బడ్నాయిని బొజ్జన్న ఇద్దరు ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు ఆమెను డోలీలో మోసుకొని వచ్చారు. అక్కడ నుండి ఆటోలో విజయనగరం జిల్లా ఎస్ కోట ఏరియా హాస్పటల్‌కు తరలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి రోడ్లు , రవాణా సౌకర్యం కల్పించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొండ గ్రామాల్లో రహదారులు లేక చాలా ఇక్కట్లు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు మార్గం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా మంజూరైన రోడ్డును వెంటనే ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు. చాలా ప్రాంతాలలో ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గిరిజనులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఇప్పటికీ వారికి డోలీలే దిక్కు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే కడుపున బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకూ వారికి దినదిన గండమే. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని దుస్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర తీసుకుళ్తే గానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితిలో చాలా మంది గిరిజనులు బాధ పడుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రవాణా సౌకర్యం కల్పించాలని గిరిజనలు మరొక్కసారి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 20 , 2024 | 09:38 AM