ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh:భద్రతా లోపాలను ఉపేక్షించం.. కంపెనీలకు చంద్రబాబు వార్నింగ్..!

ABN, Publish Date - Aug 22 , 2024 | 06:24 PM

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత అవసరమో.. కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడం అంటే అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు.

CM Chandrababu Naidu

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత అవసరమో.. కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడం అంటే అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై జిల్లాకు చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదకరం చాలా బాధాకరమని, దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎసెన్సియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమని, ఈ ప్రమాదంలో17మంది చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పరిహారాన్ని కంపెనీ ద్వారానే చెల్లిస్తున్నామన్నారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లో జన్ కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. కంపెనీ సరైన ఎస్‌వోపీ ఫాలో అవ్వలేదని స్పష్టమవుతుందన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, పరిశ్రమలు తప్పులు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూశామన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించామన్నారు.

Chandrababu: ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది


భద్రత లోపాలు..

కంపెనీలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని చంద్రబాబు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల లో ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో 119 ప్రమాదాలు జరిగాయని, 120 మంది మృతి చెందారన్నారు. నాలుగేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్ ఘటన లో విషవాయువులు లీకయ్యాయన్నారు. అంత తీవ్రత ఉన్న విషవాయువు కానప్పటికీ ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎల్‌జి పాలిమర్స్ ఘటనలో హైపవర్ కమిటీ వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోలేదన్నారు.

Botsa: అచ్యుతాపురం ఘటన బాధాకరం


హై పవర్ కమిటీ

అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీ ఘటనపై హై పవర్ కమిటీ వేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమలతో పాటు ప్రజల భద్రత ముఖ్యమన్నారు. రెడ్ కేటగిరి పరిశ్రమలు తప్పకుండా సేఫ్టీ అడిట్ జరిపించాలని సీఎం హెచ్చరించారు. పరిశ్రమల నిర్వహణపై ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తున్నామన్నారు. గత ఐదేళ్లుగా పరిశ్రమలను లూటీ చేశారని.. ఆ కారణంగానే ప్రమాదాలు ఎక్కువయ్యాయన్నారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవన్నారు. బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అధికారుల అలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు అందుబాటులో లేకుండా పోయిందని చెప్పారు. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. అంతకంటే ముందు భద్రత చాలా ముఖ్యమన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మూకుమ్మడిగా కంపెనీల్లో తనిఖీలు చేయాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీల తర్వాత నివేదికలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


CM Chandrababu: కోనసీమ జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 06:24 PM

Advertising
Advertising
<