ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyclone Dana: తీవ్రతుపానుగా ‘దానా’.. అధికారుల హెచ్చరికలు

ABN, Publish Date - Oct 24 , 2024 | 10:53 AM

Andhrapradesh: దానా తుఫాను తీరం దాటే సమయం దగ్గర పడుతోంది. ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తుపాను తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ పలు హెచ్చరికలు జారీ చేశారు.

Cyclone Dana

విశాఖపట్నం, అక్టోబర్ 24: వాయ్యువ్య బంగాళాఖాతంలో ‘‘దానా’’ తీవ్ర (Cyclone Dana) తుఫానుగా మారింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు 260 కిలోమీటర్లు, ధమ్రా(ఒడిశా)కు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి నుంచి రేపు (శుక్రవారం) తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా - ధమ్రా (ఒడిశా) సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేశారు.

Hyderabad: మేమున్నామని.. మీకేం కాదని


తుఫాను తీరం దాటే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని ఆదేశించారు. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. బలమైన ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

AP Political War: దీపావళికి ముందే ఏపీలో పొలిటికల్ టపాసులు పేలతాయా.. తుస్సుమంటాయా..


భారీ వృక్షాలు, చెట్ల వద్ద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దన్నారు. ఎండిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించాలని, వాటి కింద కూర్చోవద్దని స్పష్టం చేశారు. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకుల షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దన్నారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. కరెంట్, టెలిఫోన్ స్థంభాలకు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ సూచనలు చేశారు.


తప్పిన ముప్పు

మరోవైపు దానా తుపానుతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి నిన్న( బుధవారం) ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10 గంటలకు ఒడిసాలోని పారాదీప్‌కు 420 కి.మీ, ధామ్రాకు 450 కి.మీ, సాగర్‌ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్‌) 500కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి ఒమన్‌ దేశం సూచించిన ‘దానా’ అని పేరు పెట్టారు. తుఫాను వాయవ్యంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈరోజు ఉదయానికి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఆ తరువాత అదే దిశలో పయనించి నేటి రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిసాలోని భిటార్కనికా, ధామ్రా సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.


ఈ క్రమంలో తీవ్ర తుఫాను ఒడిసాలో తీరం దాటుతున్నందున ఏపీకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 26 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులలో రెండో నంబరు హెచ్చరిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులకు సమాచారం అందించారు.


ఇవి కూడా చదవండి..

BJP: మూసీ సుందరీకరణ పేరుతో.. పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం..

Viral Video: ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకున్నా లక్షల్లో వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 11:03 AM