Cyclone: స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
ABN, Publish Date - Nov 28 , 2024 | 06:59 AM
ఏపీపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గురువారం నుంచి వచ్చే నెల (డిసెంబర్) ఒకటో తేదీ వరకు మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖ: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కి.మీ., నాగపట్నానికి 320 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 490 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని తెలిపారు. శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో మూడు రోజులు (28, 29, 30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ. గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
కాగా ఏపీపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గురువారం నుంచి వచ్చే నెల (డిసెంబర్) ఒకటో తేదీ వరకు మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకూడదని అలర్ట్ చేసింది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రికి తుఫాన్‌గా బలపడినట్టు సమాచారం రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తీవ్రవాయుగుండం ప్రభావంతో బుధవారం జిల్లాలో ఎక్కడా వర్షం పడకపోయినప్పటికీ మసుగు వాతావరణం నెలకొని స్వల్పంగా గాలులు వీచాయి. అయితే గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ విజయకృష్ణన్ పలు శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. 30వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌తోపాటు అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. రైతులు వరి కోతలను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. ఇప్పటికే కోసిన వరి పైరును ఎత్తు ప్రదేశాల్లో కుప్పలుగా వేసి, తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని చెప్పారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సచివాలయాల సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి అవసరం మేరకు ప్రజలకు సహాయం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
కలెక్టరేట్ 08924-226599
ఆర్డీఓ కార్యాలయం, అనకాపల్లి 9491998293
ఆర్డీఓ కార్యాలయం, నర్సీపట్నం 7075356563
08934-245009, 8978542297
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 28 , 2024 | 06:59 AM