Chandrababu: విశాఖలో డీప్ టెక్నాలజీ సదస్సు.. సీఎం చంద్రబాబు హాజరు..
ABN, Publish Date - Dec 06 , 2024 | 07:56 AM
విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్‌లో జరగనున్న ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆయన ముంబై నుంచి గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్ (Novatel Hotel)లో జరగనున్న ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’ (Deep Technology Conference 2024)కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజరుకానున్నారు. అనంతరం వీఎంఆర్డీఏలో నీతి అయోగ్ అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరవుతారు. తర్వాత పార్టీ కార్యాలయంలో, నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.
కాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ముంబై నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, విప్‌లు పి.గణబాబు, వేపాడ చిరంజీవిరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, , ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, పి.విష్ణుకుమార్‌రాజు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు గండి బాబ్జీ, పీవీజీ కుమార్, బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్, సీపీ శంకుబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, డీఐజీ గోపినాథ్ జట్టీ, వీఎంఆర్‌డీ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పనాకుమారి, డీసీపీ మేరీ ప్రశాంతి, తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎయిర్‌పోర్టు నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి చేరుకుని, ప్రాంగణంలో నిలిపివుంచిన బస్సులో బస చేశారు.
టీడీపీ నేతలతో సీఎం భేటీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. 9.25 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి 9.30 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుని ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. సాయంత్రం 6.15 గంటలకు నోవాటెల్ నుంచి బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 6.45 గంటలకు విజయవాడ బయలుదేరి వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇన్‌చార్జి మంత్రిని అడ్డుకున్న పోలీసులు
సీఎం చంద్రబాబు సీరియస్
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలావీరాంజనేయస్వామిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతోపాటు పార్టీ నాయకులను కూడా లోపలకు అనుమతించలేదు. ఆ సమయంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కూడా అతిగా ప్రవర్తించడంతో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం సీఎంకు వెలగపూడి ఫిర్యాదు చేశారు. పార్టీనాయకులను లోపలకు రాకుండా ఎలా ఆపుతారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని మందలించారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులను అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
ప్రముఖ హాస్యనటుడికి యాక్సిడెంట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 06 , 2024 | 07:56 AM