ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chintamohan: చిరంజీవి, షర్మిలపై చింతామోహన్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 23 , 2024 | 11:19 AM

Andhrapradesh: మెగాస్టార్ చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం, జనవరి 23: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఏపీసీసీ చీఫ్ షర్మిలపై (APCC Chief YS Sharmila) కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Former Central minister Chintamohan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందన్నారు. జగన్ తన సొంత చెల్లెలితో గొడవల్ని సర్దుబాటు చేసుకోలేకపోయారని విమర్శించారు. షర్మిలను విమర్శిస్తే.. తమకు కూడా విమర్శించడం తెలుసన్నారు. ఏపీలో అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలవబోతోందని కేంద్రమాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.


బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అయోధ్య..

అయోధ్యను బీజేపీ (BJP) రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదన్నారు. అయోధ్య (Ayodhya) ఈవెంట్‌తో దేశం సంతోషంగా ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత పాలనలో ముస్లింలలో, క్రైస్తవుల్లో గుబులు పుడుతోందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర న్యాయం కోసం చేస్తోంటే అస్సాంలో అడ్డుకోవడం మంచిదికాదన్నారు. ఏపీలో ఆడబిడ్డలను గుండెలపై తన్నడం జగన్ పరిపాలనకు నిదర్శనమని వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని తెలిపారు. బీసీలు రాజ్యాధికారం కోరుకుంటున్నారని... వారంతా కాంగ్రెస్ పార్టీకి చేరువకావాలని కోరుకుంటున్నట్లు చింతా మోహన్ పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 11:42 AM

Advertising
Advertising