ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivas: రాజీనామా ఆమోదంపై గంటా ఫైర్.. న్యాయపోరాటానికి సిద్ధమన్న మాజీ మంత్రి

ABN, Publish Date - Jan 24 , 2024 | 03:36 PM

Andhrapradesh: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నిన్న (మంగళవారం) ఆమోదం లభించింది.

విశాఖపట్నం, జనవరి 24: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (TDP MLA Ganta Srinivasa rao) రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నిన్న (మంగళవారం) ఆమోదం లభించింది. ఈ విషయంపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడగకుండానే.. కుట్ర కోణంతో రాజీనామాను ఆమోదించారని ఫైర్ అయ్యారు.

పవిత్రమైన ఆశయం కోసం 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. స్వయంగా స్పీకర్‌ను కలసి రాజీనామా లేఖను సమర్పించానని.. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా తరువాత స్పీకర్‌ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించలేదన్నారు. రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారని... ఇప్పుడు కుట్ర కోణంతో ఆమోదించారని మండిపడ్డారు. తనను అడగకుండా రాజీనామాను ఆమోదించారన్నారు. తాము చేసిన పోరాటానికి అప్పటి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డి, వైసీపీ నాయకులు మద్దతు తెలిపి పోరాటం చేసి ఉంటే కేంద్రం స్టీల్ ప్లాంట్‌పై ఆలోచన చేసేదేమో అని చెప్పుకొచ్చారు.


మోదీకి మాసాజ్ చేస్తున్నారు...

స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై సీఎం జగన్ కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విశాఖ పర్యటనకు అనేక సార్లు వచ్చినప్పటికీ దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదన్నారు. సీఎం జగన్ కేంద్రం వద్ద మెడలు వంచుతున్నారని... మోదీకి మసాజ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తన కేసుల కోసం కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారన్నారు. తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

జగన్‌కు.. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా?

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే పదవులు కాదు స్టీల్ ప్లాంట్ కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్‌కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. పార్లమెంట్ సమావేశాలలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు (YCP MPs) ప్లకార్డులు ప్రదర్శించగలరా? అని నిలదీశారు. వైసీపీ పార్టీని అనేక మంది వీడుతున్నారని... త్వరలో జరుగుతున్న ఎన్నికలలో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. రాజీనామాను ఆమోదించి జగన్ రాజకీయంగా పాతాళానికి పడిపోయారన్నారు. ఉద్యోగులు, నిర్వాసితులతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ పోరాటం, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2024 | 03:49 PM

Advertising
Advertising